నెల రోజులు అదే పని అంటోన్న మనోజ్

మంచు మనోజ్ హీరోగా తాజాగా అహం బ్రహ్మా్స్మి అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించిన సంగతి కూడా విదితమే.

 Aham Brahmasmi To Have One Month Action Schedule-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమాలో మనోజ్ మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తాడని చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌లో తొలి షెడ్యూల్‌తోనే అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాడు మనోజ్.ఈ సినిమా తొలి షెడ్యూల్ ఏకంగా నెలరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు మనోజ్ రెడీ అవుతున్నాడట.ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ షెడ్యూల్‌ను మే నెలలో నిరవధికంగా జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.జూన్ 6 నాటికి ఈ సినిమా షూటింగ్‌ను ముగించేసి చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని మనోజ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube