క్రాక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఛేంజ్.. ఆ హీరో వల్లేనా..?  

aha postpones krack digital release due to its good theatrical run, aha post pones, februvary 5, good theatrical run, krack digital release, ravitejas - Telugu Aha Post Pones, February 5, Good Theatrical Run, Krack Digital Release, Raviteja

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కి ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది క్రాక్ సినిమా.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రవితేజ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయింది.

TeluguStop.com - Aha Postpones Krack Digital Release Due To Its Good Theatrical Run

క్రాక్ హిట్ కావడంతో రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.క్రాక్ సినిమా ఓటీటీ హక్కులను 8 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఆహా కొనుగోలు చేసింది.

ఇప్పటివరకు చిన్న సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేసిన ఆహా పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల కొనుగోలు దిశగా క్రాక్ సినిమాతో అడుగులు వేసింది.అయితే మొదట జనవరి 29వ తేదీ నుంచి క్రాక్ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.

TeluguStop.com - క్రాక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఛేంజ్.. ఆ హీరో వల్లేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే బాక్సాఫీస్ దగ్గర క్రాక్ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తుండటంతో ఓటీటీలో విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

Telugu Aha Post Pones, February 5, Good Theatrical Run, Krack Digital Release, Raviteja-Movie

అయితే ఆహా ఓటీటీ క్రాక్ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది.జనవరి 29వ తేదీనే స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నా స్వార్థంగా ఆలోచించకుండా ఆహా స్ట్రీమింగ్ ను వాయిదా వేయడం గమనార్హం.అయితే స్టార్ హీరో రవితేజ కోరడం వల్లే ఆహా క్రాక్ రిలీజ్ ను వాయిదా వేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆహా క్రాక్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి టాలీవుడ్ మనస్సును కూడా గెలుచుకుందని చెప్పవచ్చు.ఆహా ఓటీటీ తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో మరి కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఆహాకు డిజిటల్ హక్కులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

#KrackDigital #Aha Post Pones #GoodTheatrical #Raviteja #February 5

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు