ఆ రాజు మహిళలను గాడిదతో రేప్ చేయించేవాడు అంట..! వారు తప్పు చేయకపోయినా శిక్ష తప్పదట!

మ‌న దేశంలో అత్యాచారం, లైంగిక వేధింపులు అనే ప‌దాలు విన‌బ‌డ‌డం స‌హ‌జం అయిపోయింది.ఆ ప‌దాలు విన‌బ‌డని దేశాన్ని మ‌నం ఇక చూస్తామో, లేదో కూడా తెలియ‌డం లేదు.

 Ah Raju Gadidhatho Mahilalalnu-TeluguStop.com

అంత‌గా ఆ విష‌యం స‌ర్వ సాధార‌ణ‌మైంది.అయినప్ప‌టికీ ఆయా నేరాలకు పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష‌లు విధించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌లం అవుతూనే ఉన్నాయి.

దీంతో ఆ నేరాల సంఖ్య త‌గ్గ‌డం లేదు సరి క‌దా మ‌రింత పెరుగుతోంది.మృగాళ్లు మ‌రింత రెచ్చిపోతున్నారు.

ఇప్పుడే కాదు.ఒక‌ప్పుడు రాజుల కాలంలో అయితే స్త్రీలు ఇంకా ఎన్నో వేద‌న‌ల‌కు లోన‌య్యేవారు.వారికి ఎన్నో శిక్ష‌ల‌ను వేసేవారు.కుటుంబంలో ఎవ‌రైనా త‌ప్పు చేస్తే అందులో ఉండే స్త్రీల‌కు శిక్ష‌లు వేసేవారు.

మ‌హారాష్ట్ర‌లో ఒక‌ప్పుడు రాజులు ఇదే ఆచారాన్ని పాటించేవారు.కానీ వారు ఆచారం పేరిట శిక్ష‌ల‌ను అమ‌లు చేసేవారు.

అవి చాలా దారుణంగా ఉండేవి.అవేమిటంటే…

10వ శతాబ్దంలో మహారాష్ట్రలో శిలాహర్ అనే రాజ్యం ఉండేది.ఆ రాజ్యాన్ని పాలించే రాజు అప్ప‌ట్లో మ‌హిళ‌ల‌కు తీవ్ర‌మైన శిక్ష‌లు వేసేవాడ‌ట‌ఏదైనా ఒక కుటుంబంలో పురుషులు త‌ప్పు చేసినా, స్త్రీలు త‌ప్పు చేసినా ఆ కుటుంబంలో ఉండే స్త్రీలంద‌రినీ గాడిద‌ల‌తో రేప్ చేయించేవార‌ట‌.అలా శిక్ష విధించేవార‌ట‌.

స‌ద‌రు శాస‌నాల‌ను గధేగల్ అని పిలుస్తార‌ట‌.వాటిల్లో పైభాగంలో సూర్య‌, చంద్రులు చిహ్నాలు ఉంటాయి.అంటే.వారున్నంత వ‌ర‌కు ఈ శిక్ష అమ‌లులో ఉంటుంద‌ని అర్థ‌మ‌ట‌.

మ‌ధ్య‌లో కొన్ని శాస‌నాలు ఉంటాయ‌ట‌.కింద గాడిద‌ల‌చే అత్యాచారం చేయ‌బ‌డుతున్న మ‌హిళ‌ల బొమ్మ‌లు క్లియ‌ర్‌గా ఉంటాయి.

కాగా ఇలాంటి శాస‌నాలు మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 150 వ‌ర‌కు బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌.నిజంగా అలాంటి శిక్ష‌ల‌ను మ‌హిళ‌ల‌కు వేసే వారంటే న‌మ్మ‌లేకుండా ఉన్నాం.

కానీ అప్ప‌ట్లో వారి ప‌రిస్థితిని చూస్తే మాత్రం ఇప్ప‌టికీ ఎవ‌రికైనా జాలి వేస్తుంది కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube