అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ గుండెపోటుతో మృతి  

అగ్రిగోల్ద్ వైస్ చైర్మన్ ఆకస్మిక మృతి. .

Agrigold Vice-chairman Died-scheme

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అగ్రిగోల్ద్ స్కేం గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ విచారణ చేస్తుంది. ఇక చాలా కాలంగా అగ్రిగోల్ద్ బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు..

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ గుండెపోటుతో మృతి-AgriGold Vice-chairman Died

తాము పోగొట్టుకున్న సొమ్ములు వెనక్కి ఇప్పించాలని ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే అగ్రిగోల్ద్ సంస్థలో పేద, మధ్యతరగతి ప్రజలని దోచుకున్న ఆ సంస్థ అధిపతులని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే అందులో కొంత మంది కి ఆ మధ్య బెయిల్ కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా అగ్రిగోల్ద్ సంస్థ వైస్ చైర్మన్, అగ్రిగోల్ద్ స్కేంలో ప్రధాన ముద్దాయిలో ఒకరైన ఇమ్మడి సదాశివ వరప్రసాద్ ఈ రోజు ఊహించని విధంగా గుండెపోటుతో మరణించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోగా వెంటనే సమీపంలో హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే అతని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గత కొంత కాలంగా సదాశివరావు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.