బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వ్యవసాయ బిల్లుల రగడ..!

కేంద్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వ్యవసాయ బిల్లుల వార్ నడుస్తోంది.టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

 Agriculture, Bills, Bjp, Trs-TeluguStop.com

మరోసారి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన ఈ మేరకు మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదించింది.

చేతికి వచ్చిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకునే కఠిన నిర్ణయాలు తీసుకొచ్చింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేసే హక్కు లేదని వెల్లడించింది.

గత కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ చట్టంపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తోంది.పార్లమెంట్ లో కూడా బిల్లును వ్యతిరేకించింది.

ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓల తొలగింపుపై ప్రతిపక్షాల నాయకులతో చర్చించిందా అంటూ ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఎలాంటి పెట్టుబడి సమస్య ఉండదన్నారు.పంట చేతికి వచ్చినప్పుడు ధర తక్కువగా పలికితే ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించి అమ్మే సదుపాయాన్ని కల్పించిందన్నారు.

రవాణాకు సంబంధించి రైతాంగం నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు.పార్లమెంట్ లో బిల్లు ఆమోద సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత చూపిందన్నారు.

వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిందని టీఆర్ఎస్ ఆరోపించిందన్నారు.అయితే టీఆర్ఎస్ అగ్రనేతలు ఈ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో చెప్పాలని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube