ఇంకా రాజ్యమేలుతున్న ఆటవిక ఆచారం.. అద్దెకు ఆడవాళ్ల శరీరాలు.. ?  

Agreement, husband, rent wife, monthly yearly,viral news - Telugu Agreement, Husband, Monthly Yearly, Rent Wife

అనాదిగా ఆడవాళ్లను బానిసలుగా చూస్తూనే ఉంది ఈ లోకం.టెక్నాలజీలో ఊహించలేని అభివృద్ధి, రోదసిలోకి రాకెట్లు పంపేంత ఘనత, చంద్ర మండలంలో ఇళ్లు నిర్మించుకునే స్దాయికి చేరిన మనుషులు తమ తెలివిని రాకెట్ కంటే వేగంగా వృద్ధి చేసుకుంటున్నారు కానీ మనుషులను సాటి మనుషులుగా గుర్తించని వీరు యంత్రాలుగా మిగిలిపోతున్నారు.

TeluguStop.com - Agreement With The Husband To Rent The Wife

మన సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాలను రూపుమాడంలో ఇంకా వెనకబడే ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉన్న దడీచ ప్రథ అనే ఆచారం, ఈ అరాచకాన్ని వేలెత్తి చూపుతుంది.

TeluguStop.com - ఇంకా రాజ్యమేలుతున్న ఆటవిక ఆచారం.. అద్దెకు ఆడవాళ్ల శరీరాలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇకపోతే మధ్యప్రదేశ్‌లో రాజ్‌పుట్‌లు ఎక్కువగా నివాసముండే పాత గ్వాలియర్ రాజసంస్థానం పరిధిలోని శివపురి జిల్లాలో ఓ ఆటవిక ఆచారం రాజ్యమేలుతోందట.ఇక్కడ నివసించే పేదోళ్ల భార్యలను డబ్బున్నోళ్లు అద్దెకు తీసుకునే అమానుష ఆచారం అమలవుతోందట.

కట్టుకున్న భర్తలే పది రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ రేటు కట్టి మరీ బడాబాబులకు తమ భార్యలను అద్దెకు అప్పగిస్తారట.ఆమె వయసు అందంపై ఆ రేటు ఆధారపడి ఉంటుందని, నెల రోజులకొక ధర, సంవత్సారానికైతే మరో రేటు చొప్పున నిర్ణయిస్తారట.

అదీగాక అద్దెకు తీసుకుంటున్నట్లు రాతపూర్వక అగ్రిమెంట్ కూడా రాసుకోవడం విశేషం.

ఈ దురాచారం ఒక్క మధ్యప్రదేశ్‌లోని శివపురిలోనే కాదు.

గుజరాత్‌లోని వెనకబడిన ప్రాంతంలోనూ ఉందని తెలుస్తోంది.ఇకపోతే అద్దెకు తీసుకున్న వ్యక్తికి పడక సుఖంతో పాటు ఇంటి పనులు కూడా చేయాల్సి ఉంటుందట.

చీ ఇందెంత దురాచారం.ఒక స్త్రీని అంగట్లో బొమ్మలా అమ్మడం అని అంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

#Agreement #Rent Wife #Husband #Monthly Yearly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు