ఇదేందయ్యా ఇది: ఐస్కాంత శక్తి రావాలని ఏకంగా..?!

చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలు చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్తాయి.

 Agreeing That Magnetic Energy Should Com   Electric Magnetic, Viral News , Viral-TeluguStop.com

అవీ గుర్తుకు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు నవ్వు తెపిస్తుంటాయి.మరికొన్ని విషయాలకు కోపం కూడా వస్తాయి.

బ్రిటన్‌కు చెందిన ఓ యువకుడు చేసిన పని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.పిల్లాడు చేసిన పనికి తల్లిదండ్రులతోపాటు డాక్టర్లు కూడా విస్మయానికి గురయ్యారు.

యూకేకు చెందిన రైలీ మారియన్ (12 ఏళ్లు).అయస్కాంతంలా మారిపోవాలని భావించాడు.అలా మారిపోవడానికి ఏం చేయాలో ఆలోచించాడు.ఏకంగా 54 అయస్కాంతం బాల్స్‌ను మింగేశాడు.

వీటిని మింగాక మారిసన్ అనుకున్నది జరగలేదు.కడుపులో అయస్కాంతం బాల్స్ చేరడంతో కడుపు నొప్పి మొదలైంది.

అది కాస్త ప్రాణానికి ముప్పైంది.

Telugu Latest-Latest News - Telugu

మారిసన్‌కు అయస్కాంతం పాటం విన్నాక అది ఎలా పని చేస్తుంది పెద్ద పెద్ద వస్తువులను వాటి వైపు ఎలా ఆకర్షించుకుంటాయి ఒక వేళ శరీరంలో మాగ్నటిక్ పవర్ ఉంటే ఏ వస్తువునైనా తీసుకోవచ్చు కదా ఎలాంటి వస్తువునైనా ఏ ఆధారం లేకుండా పట్టుకోవచ్చు కదా అనే విధంగా తనలో తాను ప్రశ్నలు వేసుకునేవాడు.దీనిపై ప్రయోగం చేద్దామని భావించాడు.అప్పుడే మారిసన్‌కు వింత ఆలోచన తట్టింది.

మాగ్నెటిక్ బాల్స్ మింగితే ఎలాంటి వస్తువునైనా దగ్గరికి తీసుకోవచ్చని అనుకున్నాడు.దీంతో జనవరి 1వ తేదీన కొన్ని మాగ్నెటిక్ బాల్స్, జనవరి 4వ తేదీన మరికొన్ని మాగ్నెటిక్ బాల్స్‌ను మింగేలా చేసింది.

బాల్స్ మింగిన తర్వాత అవి కడుపులో నుంచి ఏ కలర్‌లో బయటకు వస్తాయో తెలుసుకుందామని అనుకున్నాడు.

కానీ, కడుపులో 54 మాగ్నెటిక్ బాల్స్ మింగడంతో భరించలేని నొప్పి మొదలైంది.

ఈ విషయాన్ని తన తల్లికి వెళ్లి చెప్పాడు.దీంతో తల్లి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించింది.

మారిసన్ కడుపును స్కాన్ చేసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌కి లోనయ్యారు.మొదట్లో 20 నుంచి 30 మాగ్నెటిక్ బాల్స్ ఉన్నాయని అనుకున్నారు.

కానీ సర్జరీ చేసిన తర్వాత 54 మాగ్నెటిక్ బాల్స్ ఉండటంతో నోరెళ్ల బెట్టారు.ఆ తర్వాత మారిసన్ ఇచ్చిన జవాబుకు విని డాక్టర్లందరూ నవ్వుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube