పవన్‌ ‘అజ్ఞాతవాసి’ అక్కడ బ్లాక్‌ బస్టర్‌, ఆల్‌ టైం రికార్డ్‌  

Agnyaathavaasi Hindi Dubbed Movie Record-

ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ టాప్‌ డిజాస్ట్రర్స్‌లో ఒక చిత్రంగా ఇది నిలిచింది. అంతటి ఫ్లాప్‌ను మూట కట్టుకున్న అజ్ఞాతవాసి కారణంగా పవన్‌ సినిమాలకు దూరం అయ్యాడు..

పవన్‌ ‘అజ్ఞాతవాసి’ అక్కడ బ్లాక్‌ బస్టర్‌, ఆల్‌ టైం రికార్డ్‌-Agnyaathavaasi Hindi Dubbed Movie Youtube Record

మామూలుగా అయితే సినిమాల్లో ఉంటూనే రాజకీయాలు చేయాలనుకున్న పవన్‌, అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో వెంటనే క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాడు. ఇక సినిమాలు వద్దులే అనుకునే స్థాయిలో అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా నెత్తిన గుడ్డ వేసుకునే పరిస్థితి వచ్చింది.

అయితే నిర్మాత వారికి కొంత మేరకు సెటిల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతటి ఫ్లాప్‌ అయిన అజ్ఞాతవాసి హిందీలో డబ్‌ అయ్యి సంచలన రికార్డును దక్కించుకుంది.

తెలుగు సినిమాలన్నీ కూడా ఈమద్య హిందీలో డబ్‌ అయ్యి టీవీల్లో మరియు యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం ఎవడు 3 అనే టైటిల్‌ తో డబ్‌ అయ్యి యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఎవడు 3 చిత్రానికి హిందీ ప్రేక్షకుల నుండి అనూహ్యంగా స్పందన దక్కింది. 48 గంటల్లో ఈ చిత్రం ఏకంగా 18 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఇంతటి భారీ వ్యూస్‌ ఇప్పటి వరకు ఏ సౌత్‌ సినిమా రాబట్టింది లేదు.

మూడు రోజుల్లోనే ఏకంగా 23 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టి ఆ వ్యూస్‌ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి..

యూట్యూబ్‌లో అజ్ఞాతవాసి జోరు చూస్తుంటే 15 రోజుల్లో 100 మిలియన్‌ వ్యూస్‌ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అజిత్‌ వివేగం చిత్రం గతంలో మొదటి రోజు 9 మిలియన్‌లను రాబట్టి ఆల్‌ టైం రికార్డుగా ఉంది. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం హిందీ డబ్బింగ్‌ లో ఆల్‌ టైం రికార్డును సొంతం చేసుకుంది. అద్బుతమైన ఈ రికార్డుతో అక్కడ కూడా పవన్‌ సత్తా తేలిపోయిందని మెగా ఫ్యాన్స్‌ సంబురాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటించారు. ఇక ఈ చిత్రంలో పవన్‌ విభిన్నంగా కనిపించి ఆకట్టుకున్నాడు.

కాని సినిమా మాత్రం తెలుగులో మెప్పించడంలో విఫలం అయ్యింది.