20 రోజులు కోమాలో ఉన్నా.. 33 లక్షల ఖర్చు.. అగ్గిపెట్ట మచ్చా కిరణ్ కన్నీటి కష్టాలివే!

సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు( Social Media Celebrity ) భారీ స్థాయిలో సంపాదిస్తారని అందరూ భావిస్తారు.

అయితే వాళ్లలో కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

అగ్గిపెట్టె మచ్చాగా( Aggipetti Macha ) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కిరణ్ కుమార్( Kiran Kumar ) షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఇంత ఫేమస్ అవుతానని నేను అనుకోలేదని పదో తరగతి వరకు చదువుకున్నానని ఆయన తెలిపారు.

నాది తిరుపతి అని స్టూడియోలో కెమెరామేన్ గా పని చేశానని కిరణ్ కుమార్ వెల్లడించారు.నేను తాగేసి పిల్లర్ ను గుద్దేయడంతో యాక్సిడెంట్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆపరేషన్ కోసం 33 లక్షల రూపాయలు ఖర్చైందని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు.రాత్రి తిన్న కూర కూడా నాకు గుర్తుండదని ఆయన తెలిపారు.

Advertisement

నాకు పెళ్లి కాలేదని ఆయన వెల్లడించడం గమనార్హం.

బయట ఎక్కడికి వెళ్లినా అగ్గిపెట్ట మచ్చా అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియో పెట్టడం వల్ల నేను ఫేమస్ అయ్యానని కిరణ్ కుమార్ అన్నారు.22 రోజులు కోమాలో ఉన్నానని ఆయన తెలిపారు.యాక్సిడెంట్ సమయంలో సిగరెట్లు, మద్యం మానేశానని ఆయన తెలిపారు.

ఇప్పుడు టీ తాగుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఎవరైనా నాతో సెల్ఫీ తీసుకుంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తానని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

నాతో కలిసి దిగిన ఫోటో నెట్ లో పెడితే వాడికి 10000 వస్తాయని అందుకే నేను డబ్బులు ఛార్జ్ చేస్తానని ఆయన తెలిపారు.మూడు నాలుగు సినిమాలలో నేను నటించానని ఆయన పేర్కొన్నారు.సైరన్, సైరన్2, టికెట్ ఆడవాళ్లకు మాత్రమే సినిమాలలో నటించానని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు.12 రోజులు నేను నీళ్లు తాగి బ్రతికానని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఖాళీగానే ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు