ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ ప్రకటించిన నిర్మాత  

Agent Sai Srinivasa Athreya to become a trilogy, Naveen Polishetty, Director Swaroop, Tollywood - Telugu Agent Sai Srinivasa Athreya To Become A Trilogy, Director Swaroop, Naveen Polishetty, Tollywood

నవీన్‌ పొలిశెట్టి హీరోగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.తక్కువ బడ్జెట్ తో డిటెక్టివ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

TeluguStop.com - Agent Sai Srinivasa Athreya To Become A Trilogy

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

స్పై కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా హీరో నవీన్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.ఇక తొలి అడుగులోనే ఈ సినిమా దర్శకుడు ఆర్‌.

TeluguStop.com - ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ ప్రకటించిన నిర్మాత-Movie-Telugu Tollywood Photo Image

ఎస్‌.జే స్వరూప్‌ ప్రతిభను చాటుకున్నారు.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే హీరో నవీన్ ప్రకటించాడు.ఇక తాజాగా నిర్మాత కూడా ఆ విషయాన్ని ద్రువీకరించాడు.

ఈ చిత్రానికి మరో రెండు భాగాలు ఉంటాయని చిత్ర నిర్మాత రాహుల్‌యాదవ్‌ నక్కా తెలియజేశారు.

ట్రయాలజీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ ఏజెంట్ రెండో భాగానికి సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని తెలియజేశాడు.కథ కూడా ఆసక్తికరంగా ఉంటుందని, దర్శకుడు స్వరూప్ మరింత అద్భుతమైన కథనంతో సీక్వెల్ స్టొరీని సిద్ధం చేశాడని తెలియజేశాడు.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ లాంచింగ్ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.ఇక ఈ సినిమా తమిళ, హిందీ, మలయాళీ రీమేక్ రైట్స్ అమ్ముడుపోయాయని, కన్నడ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే సినిమా జపాన్ బాషలో కూడా రిలీజ్ కాబోతుందని తెలియజేశాడు.కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన వెంటనే సీక్వెల్ తో సెట్స్ పైకి వెళ్తామని కూడా నిర్మాత రాహుల్ యాదవ్ తెలియజేశాడు.

ఇక ఈ సినిమాలో నవీన్ పాత్ర కొనసాగింపుగా ఉంటుందని కథ పూర్తిగా మారిపోతుందని, హీరో టీం తప్ప మిగిలిన క్యాస్టింగ్ అంతా మారిపోతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

#AgentSai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Agent Sai Srinivasa Athreya To Become A Trilogy Related Telugu News,Photos/Pics,Images..