అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం అన్నది సర్వసాధారణం అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏజ్ గ్యాప్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Age Gap Between Celebrity Couple Athiya Shetty Kl Rahul Who Is Elder ,athiya She-TeluguStop.com

వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత వుంది అనేది వారు కూడా పెద్దగా పట్టించుకోరు.ఉదాహరణగా ప్రియాంక చోప్రా తన కంటే వయసులో చిన్నవాడైన జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయినప్పటికి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.అలాగే ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆలియా, రణ్ బీర్ మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.

రణ్ బీర్ కపూర్‌కు 40 ఏళ్లు కాగా ఆలియాకు 29 ఏళ్లు.

Telugu Alia, Athiya Shetty, Bollywood, Age Gap, Celebrityathiya, Jonas, Kl Rahul

ఇక తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అతియా శెట్టి,క్రికెటర్ కేఎల్ రాహుల్ మధ్య ఏజ్ విషయం గురించి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.తాజాగా వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం రాహుల్ అతియా జంట మధ్య ఉన్న వయసు తేడా ఎంతో అనేది బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Alia, Athiya Shetty, Bollywood, Age Gap, Celebrityathiya, Jonas, Kl Rahul

అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అతియా శెట్టి వయసు ప్రస్తుతం 30 ఏళ్లు.నవంబర్ 5, 1992 న జన్మించింది అతియా శెట్టి.

స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ 18 ఏప్రిల్ 1992 న జన్మించాడు.అతని వయస్సు కూడా 30 సంవత్సరాలు.

రాహుల్ ఏప్రిల్‌లో జన్మించగా,అతియా నవంబర్‌లో జన్మించింది.ఇద్దరూ 1992లో జన్మించినవారే.

ఒకే వయస్సు వారు.అయితే రాహుల్ అథియా శెట్టి కంటే 7 నెలలు పెద్దవాడు అంతే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube