ఇంట్లో ప్రతి రోజు అగరుబత్తిని వెలిగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే, తప్పకుండా చూపించండి, లేదంటే మీకే నష్టం

హిందువులకు అగరుబత్తులకు విడదీయలేని బంధం ఉంటుంది.దేవుడిని పూజించే సమయంలో కొబ్బరికాయ కొట్టినా కొట్టకున్నా కనీసం అగరుబత్తిని అయినా వెలిగించడం హిందూవులు ప్రతి ఒక్కరు చేసే పని.

 Agarbatti Smoke Is Injurious To Health-TeluguStop.com

ఈమద్య కాలంలో అగరుబత్తికి అప్‌డేట్‌ వర్షన్‌ దూప్‌ స్టిక్స్‌ అంటూ వస్తున్నాయి.అబరుబత్తి పొగ చాలా మంచి వాసన వస్తుండటంతో దైవ భక్తి మరియు ఇల్లు చాలా సుగంద ద్రవ్యాల వాసన వస్తున్నట్లుగా, చాలా ఫ్రెష్‌గా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

అందుకే ఇంట్లో ప్రతి రూంలో లేదంటే కనీసం పూజ గదిలో అయినా అగరుబత్తిని ఎలిగించడం కామన్‌ అయ్యింది.

ఇక ఈమద్య కాలంలో కొందరు అగరుబత్తిని కేవలం దైవాన్ని కొలిచే సందర్బంలోనే కాకుండా దోమలను తోలేందుకు కూడా ఉపయోగిస్తున్నారు.రోజు ఏదో ఒక రూపంలో అగరుబత్తి పొగను పీల్చుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వైధ్యులు అగరుబత్తి పొగ మంచిది కాదంటూ నిర్థారించారు.

ముఖ్యంగా నాసిరకం అగరుబత్తికి సంబంధించిన పొగను ఎక్కువగా పీల్చడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయంటూ నిపుణులు చెబుతున్నారు.జలుబు, దగ్గు వంటి చిన్న జబ్బులతో పాటు అధికంగా అగరుబత్తి పొగను పీల్చడం వల్ల క్యాన్సర్‌ వంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అగరుబత్తి నుండి వెలువడే పొగలో కార్బన్‌డై ఆక్సయిడ్‌ కలిగి ఉంటుంది.దాన్ని ఎక్కువగా పీల్చడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.అగరుబత్తి నుండి విడుదలయ్యే మరో వాయువు సల్ఫర్‌ డై ఆక్సయిడ్‌ కూడా అత్యంత ప్రమాదకరమైనదిగా వైధ్యులు చెబుతున్నారు.

ఆస్తమా, శ్వాస కోస వ్యాదులు వస్తాయంటూ హెచ్చరిస్తున్నారు.ఊపిరితిత్తుల్లో అత్యధికంగా అగరుబత్తి పొగ వెళ్లితే మరీ దారుణంగా పాడవుతాయని చెబుతున్నారు.గుండెకు సంబంధించిన వ్యాదులు కూడా ఈ అగరుబత్తి పొగ వల్ల వస్తాయని చెబుతున్నారు.

అందుకే అగరుబత్తిని కాస్త తగ్గించుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube