మళ్లీ వార్తల్లోకెక్కిన విశ్వక్ సేన్.. షూటింగ్ చేస్తే బెదిరిస్తారా అంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్ బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.పెద్ద హీరోల వరకు షూటింగ్ లు నిలిచిపోయాయి.

 Againg Vishwak Sen Name Viral On Social Media ,vishwak Sen , Social Media , Shooting , Tollywood , Guild Team ,council Leader C Kalyan-TeluguStop.com

కాగా ఇతర భాషల హీరోల చిన్న సినిమాలు హైదరాబాదులో షూటింగ్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.చిన్న సినిమాలకు సంబంధించి 16 సినిమాలు చిత్రీకరణ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకుంటున్నాయి.

అయితే యంగ్ హీరో విశ్వక్సేన్ సైతం సొంత బ్యానర్ లో ఒక సినిమాను చేస్తున్నాడు.అయితే దానికి సంబంధించిన ఒక ఫైట్ సీను భారీ చెట్లు వ్యతిరేకరించాల్సి ఉండగా, ఆ సెట్ నిర్మాణానికి దాదాపుగా 70 లక్షలు ఖర్చు చేశారు.

 Againg Vishwak Sen Name Viral On Social Media ,vishwak Sen , Social Media , Shooting , Tollywood , Guild Team ,Council Leader C Kalyan-మళ్లీ వార్తల్లోకెక్కిన విశ్వక్ సేన్.. షూటింగ్ చేస్తే బెదిరిస్తారా అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా రెడీ అయింది.బల్గేరియా నుంచి పైటర్లు రావడం.రావు రమేష్ ఈ షూటింగ్ పూర్తిచేసుకుని ఊటీ వెళ్లిపోవాల్సి ఉంది.దీంతో ఈ సీన్ షూట్ కి బృందం రెడీ అయిందిట.

ఇంతలో గిల్డ్ బృందం షూటింగ్ కి అడ్డు పడినట్టు సమాచారం.నిన్నటి రోజున షూటింగ్ ప్రారంభించగా ఓ గిల్డు సభ్యురాలు.

సభ్యుడు ఫోన్ చేసి పరుషంగా మాట్లాడినట్లు నిర్మాతల సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి.దీనితో ఔట్ డోర్ నుంచి వచ్చిన వారిని హెచ్చరించి పని నిలుపుదల చేసారట.

ఈ విషయంపై  నిర్మాత అసహనం వ్యక్తం చేస్తూ నిర్మాతల క్షేమం చూడకపోగా బెదిరింపుసలకు పాల్పడటటం ఏంటని కౌన్సిల్ నేత సి.కళ్యాణ్ నికి తమ బాధని విన్నవించుకున్నాడట.

Telugu Council Kalyan, Guild, Tollywood, Vishwak Sen-Latest News - Telugu

దీంతో ఆయన 18వ తేదీ నుంచి షూటింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ కి బెదిరింపులు వెళ్లినట్లు మాట్లాడుకుంటున్నారు.సినిమా పూర్తిచేసి ఎలా విడుదల చేస్తారో? అంటూ హెచ్చరించారట.అయితే మిగతా సినిమాల్ని వదిలేసి విశ్వక్ సేన్ సినిమాని? ఎందుకు టార్గెట్ చేసారు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఈ వార్తలకు సంబందించి విశ్వక్ సేన్ తో మాట్లాడే ప్రయత్నం చూడగా ఆయన ఫోన్ అందుబాటులోకి రావడం లేదని వినిపిస్తుంది.ఈ వార్తలు నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube