ఆ ఎన్నికలే టార్గెట్ గా...పాత వ్యూహంతో స్పీడ్ పెంచిన 'కారు'

తెలంగాణాలో మరోసారి అధికారం దక్కడంతో…టీఆర్ఎస్ పార్టీ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.ఇక మరో ఏడేళ్ల వరకు తమకు తిరుగే లేని మెజార్టీ రావడం టీఆర్ఎస్ లో ఆ ధీమా కనిపించడానికి కారణం.

 Again Trs Follows Same Ideas Like Mla Elections-TeluguStop.com

తెలంగాణాలో నాలుగు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడినా….తమను ఏమీ చేయలేకపోయారని ఇక పంచాయతీ , పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

అందుకే… స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు.వీటితో పాటు మరో మూడు నాలుగు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల పైనా టీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది.అందుకే ఇప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గానూ, ఆ పార్టీ 11 చోట్ల విజయం సాధించింది.మిగిలిన ఆరు స్థానాల్లో రెండు కాంగ్రెస్ ఖాతాలోకి చేరగా… టీడీపీ, మజ్లీస్, బీజేపీ, వైసీపీ తలో ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.ఆ తర్వాత వారిలో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.

అందుకే ఇప్పుడు మాత్రం 17లో 16 నియోజకవర్గాల్లో గెలిచి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.అందుకోసం ముందుస్తు ఎన్నికలకు అప్లై చేసిన అభ్యర్థుల ప్రకటన ప్లాన్ నే ఇప్పుడూ అమలు చేయాలని చూస్తోంది.

ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించాడు కేటీఆర్.

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీలందరూ బాధపడకండని సిట్టింగులకే సీట్లు దక్కుతాయి అంటూ… అసెంబ్లీ ఎన్నికల్లో అవలంబించిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పకనే చెప్పాడు.అయితే మరికొంతమంది నాయకులు మాత్రం సిట్టింగులకు పోటీగా వర్గాలను ఏర్పాటు చేసుకుని, టికెట్ కోసం అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట.దీంతో ప్రస్తుత ఎంపీల్లో కొందరు భయపడుతున్నారట.

ఈ విషయం పసిగట్టిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కొక్కరుగా అభ్యర్థులను ప్రటించాలని భావిస్తున్నాడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.సిరిసిల్లలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ పేరును ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube