ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్న త్రివిక్రమ్‌ నిర్ణయం

అల వైకుంఠపురంలో చిత్రంతో మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.బన్నీ కెరీర్‌లో నిలిచి పోయే సక్సెస్‌ను ఇచ్చిన త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో అంటూ అధికారికంగా ప్రకటించాడు.

 Again Trivikram Directing Action Movie With Ntr-TeluguStop.com

అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అదేంటి అంటే ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లా కాకుండా.

అలాంటి ఎంటర్‌టైనర్‌ కాకుండా విభిన్నమైన జోనర్‌లో కాస్త ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట.గతంలో ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్‌ నిరాశ పర్చాడు.

ఈసారి అయినా సక్సెస్‌ను ఎన్టీఆర్‌కు ఇస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో త్రివిక్రమ్‌ ప్రయోగాత్మక చిత్రం.

వేరే జోనర్‌లో అంటూ ప్రయోగాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న కారణంగా నందమూరి ఫ్యాన్స్‌ భయపడుతున్నారు.ఎన్టీఆర్‌కు ఒక పక్కా కమర్షియల్‌ సక్సెస్‌ కావాలంటూ వారు కోరుకుంటున్నారు.

అల వైకుంఠపురంలో లాంటి కమర్షియల్‌ హిట్‌ను ఎన్టీఆర్‌కు ఇవ్వమని.అలాంటి కమర్షియల్‌ సబ్జెక్ట్‌తోనే సినిమా చేయమని ఫ్యాన్స్‌ పలువురు త్రివిక్రమ్‌ను కోరుతున్నారు.

వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ల మూవీ ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ ఇప్పటి నుండే మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube