మళ్లీ తేజు అదే తప్పు చేస్తున్నాడు..!

వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రతి సినిమాలో మెగా మేనరిజాలను పలికిస్తున్నాడన్న కామెంట్స్ వస్తున్నాయి.ఇక చేసిన నాలుగు సినిమాల్లో మూడింటిలో మెగాస్టార్ పాటలు కూడా రీమిక్స్ చేశాడు.

 Again Teju Doing Same Wrong Thing-TeluguStop.com

అయితే దాని గురించి తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్న తేజు ఇక నుండి అలాంటివి చేయను అంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు.అయితే మనోడు చెప్పాడు కదా ఇక నుండి తన సొంత స్కిల్స్ వాడుతాడనుకున్నారు.

కాని తేజు ఏమాత్రం మారలేదని ప్రస్తుతం తిక్క సినిమా వర్కింగ్ స్టిల్ చూస్తుంటే అర్ధమవుతుంది.

సునీల్ రెడ్డి డైరక్షన్లో తిక్క సినిమా చేస్తున్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ఓ పాటలో థమన్ ను కూడా కనిపించేలా చేస్తున్నాడు.

ఇక ఆ సాంగ్ మేకింగ్ వీడియోస్ లో తేజు మళ్లీ పవర్ స్టార్ తమ్ముడు సినిమాలో పవన్ లుక్ లా కనిపిస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.మరి ప్రతి సినిమాలో ఇలా తనకంటూ ఓ కొత్తదనం లేకుండా పూర్తిగా మామయ్యల మీద ఆధారపడుతున్న తేజు హిట్లు కొట్టినంతవరకు ఒకే కాని ఫ్లాప్స్ ఫేస్ చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

రీసెంట్ గా వచ్చిన సుప్రీం సినిమాతో కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న తేజు తిక్కతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube