తెలుగు షూటింగ్స్‌ మళ్లీ ఆగిపోనున్నాయా?

తెలుగు సినిమాలు మరియు సీరియల్స్‌ షూటింగ్స్‌ ఇటీవలే ప్రారంభం అయ్యాయి.షూటింగ్స్‌ ప్రారంభం అవ్వడంతో ఇటీవలే బుల్లి తెరపై మళ్లీ సీరియల్స్‌ మరియు షోల సందడి మొదలైంది.

 Again Shootings To Be Halted, Movie Shootings,corona Positive,lockdown,serials,m-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఒక టీవీ సీరియల్‌ ఆర్టిస్టుకు కరోనా పాజిటివ్‌ రావడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేట్లుగా కనిపిస్తుంది.తెలుగు సినిమాల షూటింగ్‌ అంతగా జరగడం లేదు.

కాని సీరియల్స్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి.

వరుసగా షెడ్యూల్స్‌ జరుగుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్‌ చేస్తున్నామని అంటున్నారు.కాని పైకి చూపించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా అసలు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

దాంతో వైరస్‌ వ్యాప్తి జరిగింది.ప్రభాకర్‌ అనే బుల్లి తెర నటుడు వైరస్‌ బారిన పడటంతో ఆయన వల్ల మరెంత మంది వైరస్‌కు గురి అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

అందుకే షూటింగ్స్‌ను మళ్లీ నిలిపేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు.

షూటింగ్స్‌ నిలిపేస్తే పరిస్థితి ఏంటీ అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్స్‌ మూడు నెలల పాటు నిలిపేయడం వల్ల సినీ కార్మికులు చాలా నష్టపోయారు.బుల్లి తెరకు చెందిన వారు కూడా ఇబ్బందులు పడ్డారు.మళ్లీ షూటింగ్స్‌ నిలిపేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నట్లుగా చెబుతున్నారు.ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవచ్చు అంటున్నారు.

వైరస్‌ వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం తప్ప ప్రభావం ఏమీ ఉండదని బుల్లి తెర ఇండస్ట్రీ వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube