కోవిడ్ టైమ్‌ లో మరో అరుదైన రికార్డ్‌ను దక్కించుకోబోతున్న టాలీవుడ్‌

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ కుదేలయ్యింది అనడంలో సందేహం లేదు.ప్రతి ఏడాది వేలాది కోట్లబిజినెస్ జరిగే బాలీవుడ్‌ లో పరిస్థితి దారుణంగా ఉంది.

 Again Record For Tollywood With Bangarraju Movie Details, Corona Third Wave, All-TeluguStop.com

అయితే బాలీవుడ్‌ తో పోల్చితే కరోనా ఆరంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టాలీవుడ్‌ టాప్ లో ఉంది.సినిమా ల విడుదల బాలీవుడ్‌ లో పూర్తిగా నిలిచి పోయాయి.2020 సంవత్సరంలో బిగ్గెస్ట్‌ వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ సినిమా గా బన్నీ అల వైకుంఠపురంలో నిలిచింది.ఎందుకంటే బాలీవుడ్‌ లో ఇతర సినిమా లు ఏమీ విడుదల కాలేదు.

ఇక 2021 లో కొన్ని బాలీవుడ్‌ లో వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.కనుక 300 కోట్లు రాబట్టి పుష్ప సినిమా ఇండియాస్ నెం.1 సినిమా గా 2021 సంవత్సరానికి గాను నిలిచింది.ఇక 2022 పొంగల్ రేసు విషయంలో కూడా టాలీవుడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దం అయ్యింది.

థర్డ్‌ వేవ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది.కరోనా థర్డ్‌ వేవ్‌ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా థియేటర్లు ఉత్తరాదిన మూసి వేయడం జరిగింది.దాంతో అక్కడ సినిమాలు విడుదల కావడం లేదు.ఇదే సమయంలో కోవిడ్‌ భయం లేని కారణంగా తెలుగులో పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి.

తెలుగు లో సంక్రాంతికి అరడజను సినిమాలు వస్తాయని అంటున్నారు.బంగార్రాజు సినిమా ఖచ్చితంగా వంద కోట్లు రాబడుతుంది.

Telugu Allu Arjun, Bangarraju, Bollywood, Corona Wave, Kollywood, Naga Chaitanya

ఇతర సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.ఒక వేళ సంక్రాంతికి బంగార్రాజు భారీ వసూళ్లను దక్కించుకుంటే 2022 జనవరి లో టాప్ ఇండియన్‌ సినిమా ఏది అంటే బంగార్రాజు పేరు చెప్పాల్సి ఉంటుంది.అది ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు దక్కబోతున్న గౌరవంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.మొత్తానికి కోవిడ్‌ సమయంలో కూడా టాలీవుడ్‌ కలకలలాడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube