ఏపీలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలకు( YCP MLCs ) మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యకు( C Ramachandraiah) శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు.
తుది విచారణకు ఈ నెల 5వ తేదీన రావాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసుల్లో స్పష్టం చేశారు.లేని పక్షంలో తాము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అయితే ఏపీలో ఇటీవల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Tammineni Sitaram ) అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్సీలకు సైతం మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేయగా.ఎవరూ స్పందించలేదు.దీంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు.