రీ వేల్యూషన్ లో మళ్ళీ అదే తప్పు! తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్వాకంపై విమర్శలు

ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫలితాలలో ఇష్టానుసారంగా తప్పులు చేసి.పాస్ అయిన వారికి ఫెయిల్ అయినట్లు, ఫెయిల్ అయినవారికి పాస్ అయినట్లు మార్కుల మెమోలు జారీ చేయడంతో విద్యార్ధుల ఆత్మహత్యలకి కారణం అయిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎంతగా విమర్శల పాలు అయ్యిందో అందరికి తెలిసిందే.

 Again Mistakes In Telangana Intermediate Re Verification Board Results-TeluguStop.com

పేపర్ కరక్షన్, వేల్యూషన్ లో లోపాలు కారణంగా ఫలితాలని గందరగోళం చేసిన ఇంటర్ బోర్డ్ అధికారులు తీరుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఇక తల్ల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి ఆందోళనలు చేసారు.

ఇక ఇంటర్ బోర్డ్ ని ప్రభుత్వం వెనకేసుకొస్తుంది అంటూ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసారు.ఇలాంటి గందరగోళం మధ్య ఇంటర్ బోర్డు మళ్ళీ రీవెరిఫికేషన్ కి విద్యార్ధులకి ఉచితంగా అవకాశం ఇచ్చింది.

ఇక చాలా మంది విద్యార్ధులు రీవెరిఫికేషన్ చేయించుకోగా అందులో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కు చెందిన అనామిక అనే అమ్మాయి అక్క రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసింది.అనామికకి తెలుగులో 20 మార్కులు రావడంతో ఫెయిల్ అయినట్టు మొదట ఫలితం ప్రకటించింది ఇంటర్ బోర్డు.

పరీక్షలో ఫెయిలయ్యానన్న బాధతో అమ్మాయి ప్రాణాలు తీసుకుంది.అయితే రీ వెరిఫికేషన్ ఫలితాల్లో అనామిక పాసైనట్టు బోర్డు ప్రకటించింది.

రీ వాల్యుయేషన్ లో 48 మార్కులు వచ్చినట్టు మెమోను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పెట్టింది.పాసైన తమ సోదరిని ఫెయిల్ అయినట్టు ప్రకటించి.

ఆమె చావుకి ఇంటర్ బోర్డు కారణం అయ్యిందని ఆమె అక్క ఆరోపణలు చేయడంతో మళ్ళీ ఆత్మరక్షణలో పడిన అధికారులు మాట మార్చారు.అనామిక సోదరి చెప్పిన మాటలు తప్పంటూ ఆరోపిస్తూ రీ వెరిఫికేషన్ లో 20 మార్కులకు కేవలం 1 మార్కు పెరిగి 21 మార్కులే అనామికకి వచ్చాయని చెప్పింది.

రీ వెరిఫికేషన్ లో 48 మార్కులు రాలేదని చెప్పి తనని తాను సేవ్ చేసుకోవడానికి ఆమె ఆన్సర్ షీట్ కూడా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది.దీంతో మరో సారి ఇంటర్ బోర్డు లోపాలు బయటపడగా.

వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube