మళ్ళీ లాక్ డౌన్ తప్పదా.... రోజురోజుకీ పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు.....

ఎక్కడి నుంచి వచ్చిందో గానీ కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం మానవ జీవితాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది.2 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కరోనా వైరస్ మహమ్మారి ఆగడాలు ఇప్పటికీ ఆగడం లేదు.కాగా ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది.ఈ క్రమంలో కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నప్పటికీ సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది.

 Again Lockdown Clarity In Telangana Details, Telangana,  Again Lockdown,  Lockdo-TeluguStop.com

అయితే నిన్నమొన్నటి వరకు 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి వ్యాక్సిన్ రెండు డోసులు విజయవంతంగా అందించినప్పటికీ మళ్లీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కోరలు చేస్తోంది.కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపుగా 1700 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా ఇందులో 639 మంది విజయవంతంగా కోలుకొని బయట పడ్డారు.

ఇక దేశంలోనే అత్యధికంగా 510 ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదయ్యాయి.దీంతో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ను నిర్వహించడంతోపాటు అత్యవసరమైతే తప్ప ప్రజలను బయటకు రావద్దని సూచిస్తోంది.

అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటూ భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి కఠిన జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

దీంతో ఇప్పటికే పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా సమావేశమై భారీ బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు.అందువల్లనే ప్రస్తుతం బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో పలు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల ఆగిపోయాయి.

Telugu Lockdown, Corona Wave, Corona, Haryana, Hyderabad, Masks, Schools, Telang

దీంతో మరోమారు సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందని కాబట్టి సినీ సెలబ్రిటీలు జూనియర్ ఆర్టిస్టులు మరియు చిన్న చిన్న పనులు చేసేటువంటి వారికి సహాయం చేయాలని కొందరు సూచిస్తున్నారు.దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఓమిక్రాన్ కట్టడి చర్యలను మొదలు పెట్టాయి.ఈ క్రమంలో 18 సంవత్సరాలు లోబడినటువంటివారికి వ్యాక్సిన్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలని అధ్యాపకులకు ఆదేశాలు జారీ చేశారు.

Telugu Lockdown, Corona Wave, Corona, Haryana, Hyderabad, Masks, Schools, Telang

అయితే దేశంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, కేరళ తదితర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పలు కార్యాలయాలు మరియు కళాశాలలలో ఆన్ లైన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి.అయితే గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా వైరస్ కేసులతో పాటూ ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో తొందర్లోనే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించే సూచనలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బయట సంచరించే సమయంలో ఖచ్చితంగా మాస్కు ధరించాలని లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Telugu Lockdown, Corona Wave, Corona, Haryana, Hyderabad, Masks, Schools, Telang

కాగా ఇప్పటికే విద్యారంగం, సినీ పరిశ్రమ వంటివి కరోనా వైరస్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయి.మరోమారు లాక్ డౌన్ విధిస్తే విద్యార్థులతోపాటు, పారిశ్రామికవేత్తలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి ఈ కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారులు ఈ విషయం పై స్పందిస్తూ ప్రస్తుతం రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని దాంతో కరోనా వైరస్ కట్టడి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అలాగే ఈ నెలాఖురున లాక్ డౌన్ విషయం పై సరైన నిరన్యం తీసుకుంటామని కాబట్టి అనవసరమైన పుకార్లని నమ్మవద్దని ప్రజలకి సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube