పుల్వామా పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు |10 మంది కి గాయాలు  

Again Attack On Pulwama Police Station In Pulwama-pulwama Police Station,telugu Viral News Updates,viral In Social Media

ఇటీవల పుల్వామా తరహ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి దాడులు కాకపోయినా పోలీసులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు సరిహద్దుల్లో రెచ్చిపోతున్నారు. వరుసగా దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు..

పుల్వామా పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులు |10 మంది కి గాయాలు-Again Attack On Pulwama Police Station In Pulwama

ఈ క్రమంలో నిన్న(మంగళవారం) కూడా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్ దాడి కి పాల్పడ్డారు ఉగ్రవాదులు. పుల్వామా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీనితో ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడగా, వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత్ లోనికి చొరబడి ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో భద్రతా దళాలు కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. సోమవారం జరిగిన ఉగ్రదాదుల కాల్పుల్లో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మంగళవారం కూడా పుల్వామా పోలీస్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు దిగడం తో సామాన్య ప్రజలు గాయపాలయ్యారు.