నెల రోజుల తర్వాత ఇంటికి వెళ్లనున్న చంద్రబాబు  

After One Month Chandrababu Naidu Go To Home-amaravathi,chandrababu Naidu,jagan Mohan Reddy,tdp

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత మూడు వారాలకు పైగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.ఏదైనా రాజకీయ పర్యటన నిమిత్తం విజయవాడ, అమరావతి వెళ్లినా కూడా తిరిగి హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకుంటున్నారు.ఉండవల్లిలోని తన నివాసం చింతమనేని గెస్ట్‌ హౌస్‌ వద్దకు నీళ్లు రావడంతో చంద్రబాబు నాయుడు కుటుంబం అక్కడ ఉండటం లేదు...

After One Month Chandrababu Naidu Go To Home-amaravathi,chandrababu Naidu,jagan Mohan Reddy,tdp-After One Month Chandrababu Naidu Go To Home-Amaravathi Chandrababu Jagan Mohan Reddy Tdp

తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా అటువైపు వెళ్లింది లేదు.కొన్ని రోజుల క్రితం విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లినా మళ్లీ వెంటనే హైదరాబాద్‌ చేరుకున్నాడు.

ఏపీ రాజకీయాలను మరియు ఇతర విషయాలను హైదరాబాద్‌ నుండే పర్యవేక్షిస్తున్న చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలోని ఉండవల్లిలో ఉండే చింతమనేని గెస్ట్‌ హౌస్‌కు వెళ్లనున్నాడు.

After One Month Chandrababu Naidu Go To Home-amaravathi,chandrababu Naidu,jagan Mohan Reddy,tdp-After One Month Chandrababu Naidu Go To Home-Amaravathi Chandrababu Jagan Mohan Reddy Tdp

బాబు నేడు అక్కడకు వెళ్లగానే వెంటనే తెలుగు దేశం పార్టీ స్థానిక ముఖ్య నాయకులతో భేటీ అవ్వబోతున్నాడు.పార్టీ పరిస్థితి మరియు ప్రభుత్వం 100 రోజుల అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు.వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చంద్రబాబు నాయుడు ఈ భేటీలో చర్చించబోతున్నాడు.