22 ఏళ్లు పోరాడితే విడాకులు వచ్చాయి

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్య నుండి విడాకులు కావాలంటూ 22 ఏళ్లుగా చేస్తున్న న్యాయ పోరాటం ఎట్టకేలకు సఫలం అయ్యింది.1993లో పెళ్లి చేసుకున్న ఆ జంట నాలుగు సంవత్సరాలు బాగానే ఉంది.ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.ఆ తర్వాత గొడవలు ప్రారంభం అయ్యాయి.గొడవలు జరగడంతో 1997లో భార్య పుట్టింటికి వెళ్లి పోయింది.అప్పటి నుండి కూడా భర్త విడాకుల కోసం కోర్టు మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు.

 After22year A Man Get Divorce Fromhiswife-TeluguStop.com

మొదట హైదరాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు.కాని భార్య విడాకులకు నో చెప్పడంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇవ్వలేదు.

ఫ్యామిలీ కోర్టు నుండి హైకోర్టుకు ఆయన విడాకుల కోసం వెళ్లాడు.హైకోర్టు పలు సార్లు ఇద్దరికి కూడా కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది.ఎంత చేసినా కూడా ఆయన మాత్రం తనకు విడాకులు కావాల్సిందే అంటూ మొండి పట్టు పట్టాడు.అయినా హైకోర్టు విడాకులకు నో చెప్పింది.

ఇక కొన్నాళ్ల క్రితం అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ జరుగుతున్న విషయంను గుర్తించిన అత్యున్నత దర్మాసనం ఆయనకు అస్సలు ఇష్టం లేనప్పుడు కలిపి ఉంచడం అసాధ్యం.

మీ జీవితంను కలిపి ఉంచేందుకు చాలా ప్రయత్నించాం.కాని మీరు ఒప్పుకోవడం లేదు.

అందుకే మీరు మీ భార్యకు 20 లక్షల రూపాయలను భరణంగా చెల్లించాలంటూ విడాకులు మంజూరు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube