మాపై మళ్లీ దాడులు చేస్తారేమో.. భయం గుప్పిట అమెరికాలోని సిక్కు సమాజం

అమెరికాలోని ఇండియానా‌పోలీస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఫెడెక్స్‌ ఫెసిలిటీ కేంద్రం వద్ద గత గురువారం ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.మృతుల్లో నలుగురు భారతీయ సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

 After Us Fedex Shooting, Sikhs In Indianapolis Feel Targeted Again, America,  Fe-TeluguStop.com

వీరిని అమర్జీత్ జోహల్ (66), జస్వీందర్ కౌర్ (64), జస్వీందర్ సింగ్ (68), అమర్జీత్ స్కోహన్(48)గా గుర్తించారు.అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

బ్రాడన్ స్కాట్ హోల్ (19) అనే యువకుడు ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థలోకి చోరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.ఈ మారణకాండలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో హర్‌ప్రీత్ గిల్ అనే భారతీయ యువతి ఉన్నారు.ఆమె కారులో కూర్చొని ఉండగా బ్రాడన్ కాల్పుల జరపడంతో ఆమె భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది.

ఇక్కడి ఫెడెక్స్‌ కార్యాలయంలో పనిచేసేవారిలో 90 శాతం భారతీయ సంతతి వారే.వీరిలో సిక్కులే ఎక్కువ సంఖ్యలో వున్నారు.

అయితే ఇండియానా పోలీస్ ఘటన అమెరికాలో స్థిరపడిన సిక్కు సమాజంలో భయాందోళనలు కలిగిస్తోంది.మరోసారి తమను దుండగులు టార్గెట్ చేస్తారేమోనంటూ వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.అధికారిక లెక్కల ప్రకారం ఇండియానా పోలీస్‌లో 8,000 నుంచి 10,000 మంది సిక్కులు నివసిస్తున్నారు.ఆటోమొబైల్, ట్రక్కింగ్ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వున్న ఈ నగరానికి వ్యవసాయ నేపథ్యం వున్న చాలా సిక్కు కుటుంబాలు భారత్ నుంచి వలస వచ్చాయి.

అమెరికాలోని కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలతో పాటు పొరుగున వున్న కెనడా నుంచి కూడా సిక్కులు సైతం ఇండియానాపోలీస్‌లో ఉపాధి పొందుతున్నారు.

వారాంతాల్లో సిక్కు సత్సంగ్ అనే పేరిట జరిగే కార్యక్రమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించడంతో సహపంక్తి భోజనాలు చేస్తారు.

ఈ ఘటన నేపథ్యంలో సిక్కులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు.ఫెడెక్స్ ఘటనలో నలుగురు సిక్కులు మరణించడంపై స్థానిక సిక్కు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.నగరంలోని ఎనిమిది వేర్వేరు దేవాలయాల నుంచి వచ్చిన సిక్కులు వారు ఎదుర్కొన్న వివక్ష గురించి మాట్లాడారు.తలపాగా ధరించినందుకు, పంజాబీ మాట్లాడినందుకు ఎదుర్కొన్న అవమానాలను వారు వెల్లడించారు.ఇదే సమయంలో గతంలో సిక్కులపై, దేవాలయాలపై జరిగిన దాడుల గురించి కూడా ప్రస్తావించారు.2012లో ఓ శ్వేతజాతి దురహంకారి ఓక్‌క్రీక్‌లోని గురుద్వారాలోకి ప్రవేశించి ఆరుగురు సిక్కుల్ని కాల్చిచంపి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 5,00,000 మంది సిక్కులు నివసిస్తున్నప్పటికీ.చాలా తక్కువ శాతం మాత్రమే రాజకీయాల్లో వున్నట్లు వారు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube