2 నెలలు గడుస్తోంది.. ఇంత అలసత్వమా: అధికార నివాసంలో అడుగుపెట్టని కమలా హారిస్‌- After Two Months In Office Kamala Harris Is Still Living Out Of Suitcases

After two months in office, Kamala Harris is still living out of suitcases, joe biden, kamala harries, Naval Observatory, Texas, Paul Murray - Telugu Joe Biden, Kamala Harries, Naval Observatory, Paul Murray, Texas

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కంటే ఎక్కువగా వినిపించిన పేరు కమలా హారిస్.డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో చివరి వరకు నిలిచిన ఆమె.

 After Two Months In Office Kamala Harris Is Still Living Out Of Suitcases-TeluguStop.com

కొన్ని కారణాలతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకుని జో బైడెన్‌కు మద్ధతు ప్రకటించారు.అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికై.

ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించారు.ఒక రకంగా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి కమలా హారిసే కారణం అన్నది బహిరంగ రహస్యం.

 After Two Months In Office Kamala Harris Is Still Living Out Of Suitcases-2 నెలలు గడుస్తోంది.. ఇంత అలసత్వమా: అధికార నివాసంలో అడుగుపెట్టని కమలా హారిస్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత మూలాలున్న వ్యక్తి కావడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్ సమాజం డెమొక్రాట్లకు జై కొట్టింది.దీని ఫలితమే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక.

జనవరి 20న వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు.అయితే వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై రెండు నెలలు గడుస్తున్నా.

ఇప్పటి వరకు ఆమె అధికార నివాసంలో పాదం మోపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రమాణ స్వీకారం జరిగిన రోజున.

అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్‌కి బైడెన్‌ వెళ్లిపోయారు.కమల మాత్రం.

తన భర్త డగ్లస్‌ ఎమ్హోఫ్‌తో కలిసి.అధ్యక్షుడి గెస్ట్‌హౌస్ ‘‘బ్లెయిర్‌ హౌస్‌’’లోనే ఉంటున్నారు.

సూట్‌కేసుల్లో సర్దుకున్న వస్తువులనే కమల కుటుంబం వినియోగిస్తోంది.ఉపాధ్యక్షుల కోసం కేటాయించిన నివాసం (నావల్‌ అబ్జర్వేటరీ)లో మరమ్మతులు జరుగుతుండటం వల్లనే ఆమె తాత్కాలికంగా బ్లెయిర్ హౌస్‌లో ఉండాల్సి వచ్చిందని సమాచారం.

అయితే టెక్నాలజీకి మారుపేరు లాంటి అమెరికాలోసాక్షాత్తూ ఉపాధ్యక్షురాలి విషయంలోనే ఇంత అలసత్వం ప్రదర్శించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.ఉపాధ్యక్షురాలి అధికార నివాసంలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్‌ కండీషనింగ్‌కు సంబంధించి మరమ్మతులు జరుగుతుండటం వల్లే ఇంత ఆలస్యం జరిగిందని ఓ వార్తాసంస్థ తన కథనంలో తెలిపింది.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.మరమ్మత్తు పనులు జరుగుతున్న తీరు పర్యవేక్షించేందుకు కమలా హారిస్‌ నావల్ అబ్జర్వేటరీని సందర్శించారు.ఈ సందర్భంగా వంటగదిలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు.అయినప్పటికీ కాంట్రాక్టు సంస్థ పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై కమల హారిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా, కొద్దిరోజుల క్రితం కమలా హారీస్ అధికారిక నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఆగంతకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

అతనిని తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు దొరికాయి.దుండగుడిని టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన పాల్ ముర్రేగా గుర్తించారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా ఉపాధ్యక్షురాలి ఇంటి వద్ద ఓ వ్యక్తి ఆయుధాలతో పట్టుబడటంతో సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది.ముర్రే వినియోగించిన వాహనంలో ఓ రైఫిల్, పేలుడు పదార్ధాలను భద్రతా సి

.

#Joe Biden #Paul Murray #Texas #Kamala Harries

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు