ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేస్ లో ఎవరున్నారంటే..?

ఐపీఎల్ లో( IPL 2023 ) తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 182 పరుగులు నమోదు చేసింది.లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు 101 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయి చిత్తుగా ఓడింది.

 After The Eliminator Match Who Is In The Orange And Purple Cap Race Details, Ipl-TeluguStop.com

క్వాలిఫయర్-1 లో ఓడిన గుజరాత్ జట్టుకు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు మే 26న క్వాలిఫయర్-2 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసులో పోటీ పడుతున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

ఆరెంజ్ క్యాప్:

బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్( Faf Duplessis ) ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.14 ఇన్నింగ్స్ లలో 730 పరుగులు చేశాడు.

Telugu Chahal, Faf Duplessis, Ipl, Mohammad Shami, Orange Cap, Piyush Chawla, Pu

ఆరెంజ్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్( Subhman Gill ) ఉన్నాడు.15 ఇన్నింగ్స్ లలో 722 పరుగులు చేశాడు.అయితే ఇతను మొదటి స్థానంలో రావడానికి ఇంకా కేవలం 8 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.క్వాలిఫయర్-2 మ్యాచ్ తో ఇతను మొదటి స్థానానికి దూసుకెళ్లే అవకాశం ఉంది.

ఇక మూడవ స్థానంలో 14 ఇన్నింగ్స్ లలో 639 పరుగులు చేసిన బెంగుళూరు జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఉన్నాడు.

నాల్గవ స్థానంలో 14 ఇన్నింగ్స్ లలో 625 పరుగులు చేసిన రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు.

ఐదవ స్థానంలో 14 ఇన్నింగ్స్ లలో 625 పరుగులు చేసిన చెన్నై జట్టు ప్లేయర్ డెవాన్ కాన్వే ఉన్నాడు.

పర్పుల్ క్యాప్:

15 ఇన్నింగ్స్ లలో 26 వికెట్లు తీసి గుజరాత్ జట్టు బౌలర్ మహమ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు.

Telugu Chahal, Faf Duplessis, Ipl, Mohammad Shami, Orange Cap, Piyush Chawla, Pu

15 ఇన్నింగ్స్ లలో 25 వికెట్లు తీసి గుజరాత్ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు.

ముంబై జట్టు బౌలర్ పీయూష్ చావ్లా 15 ఇన్నింగ్స్ లలో 21 వికెట్లు తీసి మూడవ స్థానంలో ఉన్నాడు.

రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ 14 ఇన్నింగ్స్ లలో 21 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

చెన్నై జట్టు బౌలర్ దేశ్ పాండే 15 ఇన్నింగ్స్ లలో 21 వికెట్లు తీసి ఐదవ స్థానంలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube