10 సంవత్సరాల తర్వాత మళ్లీ

వెండి తెరపై కొన్ని కాంబినేషన్‌లను చూస్తుంటే సంతోషం కలుగుతుంది.ముఖ్యంగా నిజ జీవిత అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, తాత మనుమలు, భార్య భర్తలు వెండి తెరపై కలిసి నటిస్తుంటే ప్రేక్షకులకు ఆనందం కలుగుతుంది.

 After Ten Years, Jyotika To Act With Surya-TeluguStop.com

త్వరలో ఇలాంటి కాంబినేషన్‌ వర్కౌట్‌ అయ్యేలా ఉంది.దాదాపు పది సంవత్సరాల క్రితం కలిసి నటించిన సూర్య, జ్యోతికలు మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సూర్య, జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి అయిన దగ్గర నుండి జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.

తాజాగా పిల్లలు కాస్త పెద్ద వారు అవ్వడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఈమె నటించిన రీ ఎంట్రీ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో సూర్య, జ్యోతికల కాంబో సినిమాపై వార్తలు తమిళ మీడియాలో గుప్పుమంటున్నాయి.వీరిద్దరి కోసం పలువురు దర్శకులు స్క్రిప్ట్‌లు రెడీ చేసి వినిపించడం జరిగిందట.

అందులోంచి ఒక స్క్రిప్ట్‌ వీరిద్దరి బాగా నచ్చిందని అంటున్నారు.అతి త్వరలో ఆ సినిమాను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

వచ్చే సంవత్సరం సూర్య, జ్యోతికల ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చూసే అవకాశం ప్రేక్షకులకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube