తెలంగాణ తరువాత మహారాష్ట్ర ! కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ ? 

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఒక వ్యూహం ప్రకారం బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ తమ సత్తా చాటుకుని మిగతా రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచాలనే ప్రయత్నంలో ఉన్నారు.

 After Telangana Cm Kcr Brs Party Focus On Maharashtra Details, Brs, Kcr, Telanga-TeluguStop.com

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.దేశవ్యాప్తంగా బిజెపికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అనే సంకేతాలను జనాల్లోకి పంపుతున్నారు.

అలాగే దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ లోకి  భారీగా చేరికలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ఇతర రాష్ట్రంలో వివిధ పార్టీలో ఉన్న కీలక నాయకులందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు.

అలాగే బీఆర్ఎస్ కు ( BRS ) సానుకూల పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్,  మహారాష్ట్ర,  కర్ణాటక రాష్ట్రాల్లో  తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో కొంతమంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు రాబోయే తెలంగాణ ఎన్నికలతో పాటు , మహారాష్ట్ర , కర్ణాటక ఎన్నికల్లోను బీఆర్ఎస్ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఆయా రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల దృష్టి బీఆర్ఎస్ పై పడే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Andhra Pradesh, Brs Maharastra, Karnataka, Kcr Brs, Kcr National, Kcr Pub

ముఖ్యంగా తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందని కెసిఆర్ అంచనా వేస్తున్నారు.దీనిలో భాగంగానే మహారాష్ట్రలో ( Maharashtra ) బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.ఈనెల 26వ తేదీన మహారాష్ట్రలోని కాందార్ లోహాలో సభ నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

ఈ సభలో భారీగా చేరికలు ఉండేవిధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించారు.

ఈనెల 26న నిర్వహించబోయే రెండో సభకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Andhra Pradesh, Brs Maharastra, Karnataka, Kcr Brs, Kcr National, Kcr Pub

మహారాష్ట్ర నలుమూలల నుంచి భారీగా బీఆర్ ఎస్ లోకి చేరికలు ఉండబోతున్నాయట.కాంగ్రెస్ ఎన్సీపీకి చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.అలాగే మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారట.

తెలంగాణ తర్వాత మహారాష్ట్ర పైనే కెసిఆర్ ఆశలు పెట్టుకున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube