శాకుంతలం హిట్ అయితే మరోటి రెడీ అట..!

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా చేసిన విషయం తెలిసిందే.దిల్ రాజు సమర్పించిన ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు.

 After Shakuntalam Again Dil Raju Gunasekhar Combination Movie,shakuntalam, Dil R-TeluguStop.com

సమంతతో పాటుగా దేవ్ మోహన్ కూడా ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయగా ఈ ఈవెంట్ లో గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా గురించి ఒక హింట్ ఇచ్చేశాడు.

శాకుంతలం సినిమాకు దిల్ రాజు చేసిన హెల్ప్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేసిన గుణశేఖర్ అసలు ఆయన లేకపోతే ఈ సినిమా లేదని క్రెడిట్ మొత్తం దిల్ రాజుదే అని అన్నారు.

ఇక నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే అని హింట్ ఇచ్చారు గుణశేఖర్.

అయితే ప్రస్తుతం శాకుంతలం గురించి మాత్రమే మాట్లాడాలి అంటూ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం పోగొట్టుకోనని.బాగా వచ్చే వరకు చెక్కుతూనే ఉన్నామని అన్నారు గుణశేఖర్.

శాకుంతలం హిట్ పడితే మాత్రం గుణశేఖర్ కి వెంటనే ఓ సినిమా లైన్ లో ఉన్నట్టే లెక్క.సమంత ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని చూసి ఆమె ఒక సూపర్ స్టార్ అనేశారు గుణశేఖర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube