ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 1 తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించాడు.ఇక రాబోతున్న పుష్ప 2 సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
పుష్ప 1 హిట్ మేనియాతో పుష్ప 2( Pushpa 2 ) కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు.అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ప్లాన్ తోనే ఫ్యాన్స్ అంతా కూడా కన్ ఫ్యూజ్ అవుతున్నారు.
అదేంటి అనుకోవచ్చు.సందీప్ వంగాతో ఆల్రెడీ ఒక సినిమా ఫిక్స్ చేసుకున్న అల్లు అర్జున్ అంతకన్నా ముందు త్రివిక్రం( Trivikram ) తో సినిమా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.
అయితే ఇక మీదట తను చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది.అయితే బన్నీ చేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది మాత్రం తెలియట్లేదు.పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అదే హిట్ మేనియా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.బన్నీ మాత్రం పెద్ద ప్లానింగ్ తోనే ఉండగా ఆ రేంజ్ ఫలితాలు అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.