పవన్‌ మూవీ పూర్తి అయిన తర్వాత మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ మూవీ!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తదుపరి సినిమా విషయంలో గందరగోళం నెలకొంది.ఎన్టీఆర్‌ 30 సినిమాను త్రివిక్రమ్‌ ప్రకటించాడు.

 After Pawan Kalyan Movie Trivikram Will Direct Mahesh Babu Movie-TeluguStop.com

గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌30 సినిమాను ప్రకటించిన త్రివిక్రమ్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఆలస్యం కారణంగా పట్టాలెక్కించడంలో విఫలం అయ్యాడు.అనూహ్యంగా ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం దర్శకుడు మారాడు.

త్రివిక్రమ్‌ ప్లేస్‌ లో కొరటాల శివ వచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అనుకున్నారు.అదే నిజం అన్నట్లుగా కొరటాల శివ అధికారికంగా ప్రకటన చేశాడు.

 After Pawan Kalyan Movie Trivikram Will Direct Mahesh Babu Movie-పవన్‌ మూవీ పూర్తి అయిన తర్వాత మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్‌ 30 సినిమా ను పక్కకు పెట్టడంకు కారణం ఏంటీ అనేది త్రివిక్రమ్‌ చెప్పాలంటూ అభిమానులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.అసలు కారణం ఏంటీ అనేది తెలియదు కాని త్రివిక్రమ్‌ తదుపరి సినిమా మహేష్‌ బాబుతో మాత్రం అని క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం మహేష్‌ బాబు చేస్తున్న సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందని అంటున్నారు.

పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

మే 31న మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ కాంబో మూవీ అధికారిక ప్రకటన రాబోతుందట.అంతకు ముందే సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయబోతున్నాడు.ఇక మహేష్‌ బాబుతో సినిమా కంటే ముందు పవన్‌ తో సినిమాను త్రివిక్రమ్‌ పూర్తి చేయాల్సి ఉంది.అదేంటి పవన్‌ తో త్రివిక్రమ్‌ సినిమా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.

అదేనండి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ను పవన్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సాగర్‌ చంద్ర దర్శకుడు.

కాని త్రివిక్రమ్‌ షాడో డైరెక్టర్‌ అనే విషయం తెల్సిందే.అధికారికంగా డైలాగ్స్ మరియు స్క్రీన్‌ ప్లే ను త్రివిక్రమ్‌ ఇస్తున్నాడు.

అనధికారికంగా సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు అనేది కొందరి మాట.అసలు విషయం ఏమో కాని పవన్‌ రీమేక్‌ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబుతో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.

#Pawan #Trivikram #Mahesh Babu #Pawan Kalyan #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు