యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశాడు సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ.మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత తారక్ తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ అసలైతే అల్లు అర్జున్ తో చేయాల్సి ఉన్నా ఆ సినిమాను కాదని నందమూరి నట సింహం బాలయ్య బాబుతో సినిమా చేస్తాడని అంటున్నారు.
బాలకృష్ణతో కొరటాల శివ కాంబినేషన్ అదిరిపోతుంది.
తీసేది కమర్షియల్ సినిమాలే అయినా సరే సామాజిక అంశాలని టచ్ చేస్తూ వెళ్తాడు కొరటాల శివ.అందుకే ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు.ఇప్పటికే ప్రభాస్, మహేష్, ఎన్.టి.ఆర్, చిరంజీవి లాంటి హీరోలని డైరెక్ట్ చేసిన కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో చేస్తారని తెలుస్తుంది.అఖండ తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఆ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుందని టాక్.మరి ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.
గోపీచంద్ మలినేని సినిమాతో మరోసారి ఫ్యాక్షన్ కథతో వస్తున్న బాలకృష్ణ కొరటాల శివ సినిమా కథ మాత్రం సోషల్ మెసేజ్ తో వస్తున్నాడని టాక్.