మహేష్ ఫ్యాన్స్‌పై పోలీసు కేసు నమోదు  

After NTR Case Filed On Mahesh Babu Fans, NTR, Mahesh Babu, Meera Chopra, Tharun Bhasker, Police Case - Telugu Mahesh Babu, Meera Chopra, Ntr, Police Case, Tharun Bhasker

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను టార్చర్ చేస్తున్నారంటూ టాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఆమెను మానసకింగా వేధింపులకు గురిచేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులపై ఆమె మండి పడింది.

 After Ntr Case Filed On Mahesh Babu Fans

కాగా ఎన్టీఆర్‌కు ఇలాంటి అభిమానులు ఉండటంత నిజంగా అవమానకరం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.కాగా ఈ వివాదం ప్రస్తుతం సద్దుమనగడంతో అందరూ సైలెంట్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఇలాంటిదే మరో వివాదం టాలీవుడ్‌లో తలెత్తింది.పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ టాలీవుడ్‌లో తనకంటూ మంచి పేరుతో పాటు గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు.

మహేష్ ఫ్యాన్స్‌పై పోలీసు కేసు నమోదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కొత్త ట్యాలెంట్‌కు ఎప్పుడూ అవకాశం ఇచ్చే ఈ డైరెక్టర్ తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, మహర్షి చిత్రాలపై కొన్ని కామెంట్స్ చేశాడు.దీంతో మహేష్ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయి తరుణ్ భాస్కర్‌ను ట్రోల్ చేశారు.

ఇది ఎంతలా సాగిందంటే, ఆయనకు వ్యక్తిగతంగా బెదిరింపులు కూడా ఇచ్చారట.దీంతో విసిగిపోయిన తరుణ్ భాస్కర్ తాజాగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఈ విధంగా ప్రవర్తించడం చాలా దురదృష్టం అంటూ తరుణ్ భాస్కర్ మండిపడ్డాడు.ఏదైనా ఉంటే తనతో ఫేస్ టు ఫేస్ డీల్ చేయాలని, అంతేగాని ఇలా చిల్లర కామెంట్స్ చేస్తూ తన ఫ్యామిలీని ఇందులోకి లాగడం ఏమిటని ఆయన మహేష్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు.

మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరువాత పోలీసులకు మహేష్ ఫ్యాన్స్ పని చెప్పడంతో వారు పలువురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

#Mahesh Babu #Police Case #Tharun Bhasker #NTR #Meera Chopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

After Ntr Case Filed On Mahesh Babu Fans Related Telugu News,Photos/Pics,Images..