ఎఫ్‌3 తర్వాతే శేఖర్‌ కమ్ముల చిత్రం  

Anil Ravipudi, F2 Movie Sequel, F3 Movie, Venkatesh, Sekhar Kammula, Love story, Narappa - Telugu Anil Ravipudi, F2 Movie Sequel, F3 Movie, Love Story, Narappa, Sekhar Kammula, Venkatesh

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్‌ తీయాలని అనీల్‌ రావిపూడి, నిర్మించాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నారు.

 After Narappa F3 Movie Shooting

అనుకున్నట్లుగానే ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల అయిన వెంటనే అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టాడు.లాక్‌డౌన్‌లోనే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది అంటూ ప్రకటించాడు.

వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుందని అనుకుంటున్న సమయంలో ఎఫ్‌ 3 చిత్రం కంటే ముందు వెంకటేష్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు అనేది వార్తల సారాంశం.

ఎఫ్‌3 తర్వాతే శేఖర్‌ కమ్ముల చిత్రం-Movie-Telugu Tollywood Photo Image

ఈ విషయంలో సినీ వర్గాల ద్వారా క్లారిటీ వచ్చింది.అనీల్‌ రావిపూడి ఈ విషయంలో సన్నిహితుల వద్ద మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అనీల్‌ రావిపూడి తాజాగా సన్నిహితుల వద్ద మాట్లాడుతూ వెంకటేష్‌ నారప్ప చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఎఫ్‌ 3 చిత్రం మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డైలాగ్‌ వర్షన్‌ను రాస్తున్నట్లుగా పేర్కొన్నాడు.వచ్చే ఏడాది ఆరంభంలో ఎఫ్‌ 3 ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఆ తర్వాత సమ్మర్‌లో శేఖర్‌ కమ్ముల వెంకీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.

#Venkatesh #Love Story #Sekhar Kammula #Narappa #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

After Narappa F3 Movie Shooting Related Telugu News,Photos/Pics,Images..