బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెర రంగమ్మత్తగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ (Anasuya) ప్రస్తుతం బుల్లితెరకు దూరమయ్యారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా పలు సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసిన ఏమాత్రం సహించదు అదేవిధంగా మహిళలను ఉద్దేశిస్తూ ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడిన అసలు సహించకుండా వారికి తగిన స్థాయిలో బుద్ధి చెబుతూ ఉంటారు.మహిళలను ఉద్దేశిస్తూ( Women ) అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.మహిళలను ప్రోత్సహిస్తే గొప్ప స్థాయికి వెళ్తారనే అర్థం వచ్చేలా ఈమె మహిళల గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
మహిళలు సరైన విధంగా ఉన్నప్పుడు వారిని సరిగ్గా ట్రీట్ చేస్తే వారు ఎంతో గొప్పగా ప్రకాశిస్తారు అంటూ ఒక పోస్ట్ చేశారు.అయితే మహిళలు ఒక పని పట్ల ఎంతో నమ్మకంతో ఉంటే అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని అలా ఎంకరేజ్ చేసినప్పుడు వారు ఎంతో గొప్ప స్థానంలో ఉంటారు అంటూ మహిళలకు మద్దతుగా వారిని సపోర్ట్ చేయాలంటూ కోరుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.విమానం సినిమా(Vimanam Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమా(Pushpa 2 Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.