'మన్మధుడు 2' తర్వాత నాగార్జున తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?  

After Manmadhudu Nagarjuna Ready To Act Inbangarraju-akhil,bangarraju,nagachaitaniah,nagarjuna

నాగార్జున హీరోగా నటించిన భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన్మధుడు 2’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.కనీసం 10 కోట్ల రూపాయలను రాబట్టడంలో ఈ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.నాగార్జున కెరీర్‌లో నిలిచి పోయే చిత్రం అవుతుందని అంతా నమ్మకంగా అనుకున్నారు.కాని అనూహ్యంగా సినిమా డిజాస్టర్‌ అయ్యింది.నాగార్జున వయసుకు తగ్గట్లుగా నటించాలంటూ ఒక సలహా కూడా ప్రేక్షకుల నుండి వచ్చింది...

After Manmadhudu Nagarjuna Ready To Act Inbangarraju-akhil,bangarraju,nagachaitaniah,nagarjuna-After Manmadhudu Nagarjuna Ready To Act InBangarraju-Akhil Bangarraju Nagachaitaniah

తెలుగు ప్రేక్షకులు అరవై ఏళ్ల హీరోలను అస్సలు కోరుకోవడం లేదని మన్మధుడు 2 ఫలితంతో మరోసారి నిరూపితం అయ్యింది.

After Manmadhudu Nagarjuna Ready To Act Inbangarraju-akhil,bangarraju,nagachaitaniah,nagarjuna-After Manmadhudu Nagarjuna Ready To Act InBangarraju-Akhil Bangarraju Nagachaitaniah

మన్మధుడు 2 చిత్రం ఫ్లాప్‌ నేపథ్యంలో నాగార్జున తన మనసు మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది.మొదటి నుండి రొమాంటిక్‌ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన నాగార్జున ఆరు పదుల వయసు దాటిన కారణంగా ఇకపై అలాంటి సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.వయసుకు తగ్గట్లుగా ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యంతోనే చాలా రోజులుగా పక్కకు పడి ఉన్న బంగార్రాజ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగార్రాజు పాత్రను బేస్‌ చేసుకుని బంగార్రాజు టైటిల్‌తో ఒక చిత్రం రాబోతుంది అంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి.ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చబోతుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.నాగచైతన్య హీరోగా నటించబోతుండగా, తన వయసుకు తగ్గ పాత్రతో నాగార్జున ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.వచ్చే వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.