మహా సముద్రం తర్వాత మరో సాలిడ్ కథతో ఆరెక్స్ డైరక్టర్..!

ఆరెక్స్ 100 సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన అజయ్ భూపతి మొదటి సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.ఇక ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ తో మహా సముద్రం అంటూ ఓ క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నాడు అజయ్ భూపతి.

 After Maha Samudram Ajay Bhupathi Another Solid Story , Rx 100 , Ajay Bupathi ,-TeluguStop.com

షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇక లేటెస్ట్ గా అజయ్ భూపతి మహా సముద్రం సినిమా తర్వాత మరో సాలిడ్ స్టోరీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

ప్రేమకథలనే కొత్తగా చెప్పడంలో తన టాలెంట్ చూపిస్తున్న అజయ్ భూపతి మహా సముద్రంతో మరోసారి తన సత్తా చాటనున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత మరో అదిరిపోయే లవ్ స్టోరీ రాసుకున్నాడట.

లాక్ డౌన్ టైం లో షూటింగ్ లేకపోవడంతో ఈ సినిమా కథ రాసుకున్నారట అజయ్ భూపతి.త్వరలోనే ఆ సినిమాకు సంబందించిన అప్డేట్ కూడా వస్తుందని టాక్.

మహా సముద్రం హిట్ అయితే ఈసారి అజయ్ భూపతి ఏ హీరో కావాలనుకున్నా అతనితో చేసేస్తారని చెప్పొచ్చు.అజయ్ భూపతి రాసుకున్న ఆ సాలిడ్ స్టోరీ ఏంటి అజయ్ థర్డ్ మూవీ ఎవరితో ఉంటుంది అన్న విషయాలు త్వరలో తెలుస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube