రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకుండా పదేళ్ళు ఉండటం అంటే చాలా కష్టమైన విషయం.ఒక కమ్యూనిస్ట్ పార్టీలకి తప్ప ఏ ఇతర పార్టీలు అధికారం లేకుండా ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు.ప్రాంతీయ పార్టీలు అయితే ఇక షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సిందే.అధికారంలో ఉన్న పార్టీ తరుపున గెలిచినా నేతలు వేల కోట్ల రూపాయిలు నల్లదనం గట్టిగా సంపాదించుకుంటారు.
కాని పార్టీ ఓడిపోయి అధికారానికి దూరం ఉన్నప్పుడు మాత్రం సంపాదించిన నల్లదనంలో పైసా కూడా పార్టీ ఫండ్ గా ఇవ్వడానికి ఇష్టపడరు.ఒక వేళ ఇస్తే ఏదైనా ఇబ్బందులు వస్తాయనే భయంతో నల్లదనం బయటకి తీయడానికి కూడా ఇష్టపడరు.ఈ కారణంగానే ఇప్పుడు సుదీర్ఘమైన చరిత్ర కలిగి 49 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఆర్ధిక కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి.
ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే కార్పోరేట్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ వస్తుంది.అలా కాకుండా బలమైన నాయకత్వం ఉండి భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అని నమ్మకం కలిగించిన పార్టీ ఫండ్స్ వ్యాపార వర్గాల నుంచి వస్తాయి.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు.అలాగే బలమైన నాయకత్వం కూడా లేదు.దీంతో ఆ పార్టీకి విరాళాలు ఇచ్చేవారు గణనీయంగా తగ్గిపోయారు.
దీంతో ఇప్పుడు పార్టీ ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటుంది.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ షో తర్వాత ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా తగ్గించుకోవాల్సిన దుస్థితికి పార్టీకి వచ్చింది.ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఇప్పటి వరకు 55 మంది సిబ్బంది ఉండేవారు.అయితే గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని 20 మంది రాజీనామా చేశారు.ఇప్పుడు ఇది ఆ పార్టీ ఆర్ధిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెబుతుంది.
మరో వైపు బీజేపీ పార్టీకి విరాళాలు కోట్ల రూపాయిలు వచ్చి పడుతున్నాయి.దీంతో దేశంలో ధనిక పార్టీగా బీజేపీ మారిపోయింది.