చాలా కాలం తర్వాత కళ్యాణ్‌ రామ్‌ సాధించాడు.. ఇదే కొనసాగిస్తే బెటర్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘118’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.షాలిని పాండే మరియు నివేదా థామస్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

 After Long Time Kalyan Ram Got Huge Pre Business For 118-TeluguStop.com

అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాపై ఆసక్తి లేదు.దిల్‌రాజు ఈ చిత్రంను పంపిణీ చేస్తున్న కారణంగా సినీ వర్గాల్లో తప్పకుండా బాగుంటుందని నమ్మకం ఉంది.

ప్రేక్షకులు కూడా విడుదలైన తర్వాత తప్పకుండా సినిమాపై పాజిటివ్‌ గా స్పందిస్తారు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో బయ్యర్స్‌ ఈ చిత్రాన్ని మంచి రేటుకు కొనుగోలు చేయడం జరిగింది.దాంతో నిర్మాతకు విడుదలకు ముందే దాదాపుగా నాలుగు కోట్ల లాభాలు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.‘118’ చిత్రంను 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా సమాచారం అందుతోంది.కళ్యాణ్‌ రామ్‌ కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్‌తో సినిమాను మూసేశారు.

ఇక ఈ చిత్రం ఏపీ మరియు నైజాంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది.సీడెడ్‌ ను కోటి రూపాయలకు అమ్మేశారు.ఇక శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో 3.5 కోట్ల రూపాయలు నిర్మాత ఖాతాలో పడ్డాయి.ఇక హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూపంలో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది.అంటే మొత్తంగా 14.5 కోట్లతో ఈ చిత్రం బిజినెస్‌ క్లోజ్‌ అయ్యింది.ఓవర్సీస్‌లో నిర్మాతలు సొంతంగా విడుదల చేస్తున్నారు.

అంటే అక్కడ రూపాయి వచ్చినా కూడా లాభమే అన్నట్లు.అంటే సినిమాకు మంచి టాక్‌ వస్తే లాభాలు భారీగానే ఉండే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కళ్యాణ్‌ రామ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.కళ్యాణ్‌ రామ్‌ నటించిన సినిమాల నిర్మాతలకు విడుదల ముందే లాభాలు రావడం అనేది చాలా అరుదు.

చాలా కాలం తర్వాత 118 చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.మరి సక్సెస్‌ను కూడా కళ్యాణ్‌ రామ్‌కు తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube