జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తరువాత సినిమా ఏ హీరోతో అంటే?

సాధారణంగా డైరెక్టర్స్ అనే వారు తెర వెనుక ఉండి సినిమాను నడిపిస్తారు.అందుకే నటులకు ఫ్యాన్స్ ఉంటారు తప్ప డైరెక్టర్స్ కి ఫ్యాన్స్ ఉండరు.

 After Jaatiratnalu Director Anudeep With Which Hero Is The Film , Jathiratnalu,-TeluguStop.com

అయితే ఇప్పుడు జాతిరత్నాలు సినిమాకు సీన్ పూర్తిగా రివర్స్ అయిందని చెప్పవచ్చు.జాతిరత్నాలు సినిమా నటీనటుల కంటే ఎక్కువగా డైరెక్టర్ కు క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు.

యాంకర్ సుమ షో క్యాష్ లో అతిథులుగా జాతిరత్నాలు సినిమా టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ షోలో డైరెక్టర్ చేసిన కామెడీతో అడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు.

తరువాత డైరెక్టర్ అనుదీప్ కాస్తా క్యాష్ అనుదీప్ గా మారిపోయారు.అయితే జాతిరత్నాలు సినిమా థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.మొదటి రోజే గ్రాస్ 4 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించి, రోజు రోజుకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

అయితే జాతిరత్నాలు సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ తరువాత ఏ జానర్ లో సినిమా చేయనున్నాడు, ఏ హీరోతో సినిమా చేస్తాడనే టాక్ పెరిగిపోతోంది.అయితే డైరెక్టర్ అనుదీప్ తరువాత సినిమా ఎనర్జిటిక్ హీరో రామ్ తోఫుల్ మాస్ సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ విషయంపై అధికారికంగా డైరెక్టర్ కాని, హీరో కాని స్పoదించని పరిస్థితుల్లో ఈ రూమర్లు నిజమా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu Anchor Suma, Cash Show, Anudeep, Gossips, Jathiratnalu-Latest News - Telu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube