బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి అందరికీ పరిచయమే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించింది.ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్నా కూడా బుల్లితెరలో మాత్రం ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.
ఇక ఈమె 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం రాజ్ కుంద్రా బాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే శిల్పా శెట్టి తన భర్త గురించి అన్ని మర్చిపోయినట్లు అనిపిస్తుంది.
కొన్ని రోజుల క్రితం శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చేస్తున్న వ్యాపారం గురించి కొన్ని నిజాలు బయటపడ్డాయి.
నీలి చిత్రీకరణ చేస్తూ వాటిని పలు యాప్ లతో నడిపిస్తున్నట్లు తెలిసింది.అంతేకాకుండా కొందరిని అవకాశాల కోసం తీసుకొని వారితో కూడా అలాంటి చిత్రీకరణ చేస్తున్నట్లు బయటపడింది.
దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేయగా.విచారణలో పలువురి పేర్లు బయటపడ్డాయి.
ఇక శిల్పాశెట్టి ని కూడా విచారించగా అందులో తనది ఎటువంటి తప్పు లేదని వదిలేశారు.

ఇప్పటికీ రాజ్ కుంద్రా పోలీస్ అదుపులోనే ఉండగా.శిల్పా శెట్టి మాత్రం మామూలుగా మారినట్లు తెలుస్తుంది.అంతే కాకుండా మళ్లీ ఆమె షూటింగ్ లో పాల్గొంటుంది.
బుల్లితెరలో ప్రసారమవుతున్న సూపర్ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొనగా ఈ షో లో ఆమె జడ్జిగా చేస్తుంది.ఈమె ఈ షోకు షూటింగ్ లో పాల్గొన్నట్లు ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.

దాదాపు ఒక నెల నుండి రాజ్ కుంద్రా వల్ల ఆమె షూటింగ్ లోకి రావడం మానేయగా.తిరిగి అన్నీ మర్చిపోయి తన పనులు తాను చూసుకుంటుంది.ఇక తాను షూటింగ్ లో పాల్గొన్నదని తెలియగా.నెటిజన్లు శిల్పా శెట్టి అన్ని మర్చిపోయింది అంటూ. తనకు తన భర్త గురించి ఎలాంటి బాధ లేదేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.