ఎన్నికల తరువాత తొలిసారి పోలవరం లో బాబు ఏరియల్ సర్వే  

After Elections Babu First Aerial Survey In Polavaram-

ఏపీ సి ఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎన్నికల తరువాత బాబు తొలిసారిగా పోలవరం లో పర్యటించిన ఆయన స్పిల్ వె,కాపర్ డ్యామ్ ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పోలవరం ఏపీ జీవ నాడి అని,పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛ అని,ఇప్పటివరకు పోలవరం పనులు 70 శాతం మేర పూర్తి అయినట్లు చంద్రబాబు అన్నారు. పోలవరం ద్వారా 45 లక్షల ఎకరాల వరకు సాగునీరు లభిస్తుందని,దీనితో కరువును జయించవచ్చు అని బాబు తెలిపారు. పోలవరం వ్యూ పాయింట్ నుంచి పనులను బాబు దగ్గరుండి పరిశీలించారు..

ఎన్నికల తరువాత తొలిసారి పోలవరం లో బాబు ఏరియల్ సర్వే -After Elections Babu First Aerial Survey In Polavaram

పోలవరం మెయిన్ డ్యామ్ గేట్ల బిగింపు పనుల గురించి ఆరా తీసిన బాబు,త్వరలో మిగిలిన గేట్ల ను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని, ఇప్పటివరకు 90 సార్లు వర్చువల్ ఇన్స్ పెక్షన్ నిర్వహించానని బాబు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు,కాంట్రాక్టు ఏజెన్సీ లతో బాబు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. 980 మెగా వాట్ల విద్యుత్ కు అవకాశం ఉంది.