ఇక నుండి 50 రోజుల తర్వాతే... దిల్ రాజు తర్వాత మైత్రి వారు

సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.ఇప్పటికే బాలీవుడ్‌ ప్రేక్షకులు ఓటీటీ ఫస్ట్‌.

 After Dil Raju Mythri Movie Makers Ok To After 50 Days , Dil Raju, Movie News, M-TeluguStop.com

థియేటర్ నెక్ట్స్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అందుకే ఓటీటీ లో విడుదల అయిన సినిమాలకు మంచి ఆధరణ ఉంటుంది.

అదే సినిమా అంతకు ముందు థియేటర్‌ లలో విడుదల అయితే జనాలు పట్టించుకోవడం లేదు.మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు ఓటీటీ యొక్క ప్రాభవం పెరుగుతున్న ఈ సమయంలో థియేటర్ లను కాపాడుకునే బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఉంది.అందుకే థియేటర్లలో విడుదల అయిన సినిమా లు అవి హిట్ అయినా ప్లాప్ అయినా కూడా ఓటీటీ లో విడుదల చేయడానికి కనీసం 50 రోజుల ఆగాల్సిందే.50 రోజుల లోపు స్ట్రీమింగ్‌ కు ఇస్తే అది కఠిన శిక్ష కు దారి తీస్తుంది అంటూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఒకప్పుడు బుల్లి తెర పై టెలికాస్ట్‌ కు గడువు విధించినట్లుగానే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కూడా గడువు ఉండాల్సిందే అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

కొందరు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.దిల్ రాజు ఇప్పటికే తన సినిమాలను ఓటీటీ లో థియేటర్‌ రిలీజ్ అయిన 50 రోజులకు స్ట్రీమింగ్ చేస్తున్నారు.అలాగే మైత్రి మూవీస్ వారు కూడా ఇక నుండి తమ బ్యానర్‌ నుండి రాబోతున్న సినిమాలను 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ కి ఇస్తామని ప్రకటించారు.ఇప్పటి వరకు వచ్చిన సినిమాల విషయం వదిలేస్తే ఇక నుండి రాబోతున్న సినిమాలకు ఓటీటీ ఒప్పందం చేసుకునే సమయంలోనే 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ కు అనుమతి ఇస్తూ అగ్రిమెంట్‌ చేసుకుంటాం అన్నట్లుగా మైత్రి వారు ప్రకటించారు.

ఈ విధానంను అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఇటీవల ఆయన ఓటీటీ ల్లో సినిమా ల స్ట్రీమింగ్‌ కు ఎక్కువ సమయం కావాలి అన్నాడు.

అయితే సురేష్ బాబు మాత్రం ఈ విధానంకు ఒప్పుకోడేమో అంటూ వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీ మొత్తం కూడా 50 రోజుల తర్వాతే అంటే అప్పుడు థియేటర్లకు మంచి రోజులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube