అక్క విడాకులకు సపోర్ట్ ఇస్తున్న చెల్లి.. ప్రొఫైల్ పిక్ మారుస్తూ..

ఇండస్ట్రీలో వరుసగా బ్యాడ్ న్యూస్ లనే వినాల్సి వస్తుంది.గత సంవత్సరం అంత అలాగే గడిపిన ఇప్పుడు కొత్త ఏడాది అయినా మంచి వార్తలను వింటాము అనుకుంటే ఈ ఏడాది కూడా ఇలాంటి వార్తలనే విని ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 After Dhanush-aishwaryaa Split Soundarya Drops New Profile Pic With Dad Rajinikanth And Sister, New Profile Pic, Dhanush, Aishwaryaa Rajinikanth, Soundarya Rajinikanth,rajinikanth-TeluguStop.com

గత ఏడాది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు.ఇక ఏడాది చివర్లో సమంత, నాగ చైతన్య కూడా ఇలాగె విడాకులు ప్రకటించి సంచలనం రేపారు.

వీరి విడిపోయామని ప్రకటించి ఇన్ని రోజులు అవుతున్న ఈ వార్తను అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు.ఈ వార్త అబద్ధం అయితే బాగుండు అని ఇప్పటికి చై-సామ్ అభిమానులు కోరుకుంటున్నారు.

 After Dhanush-Aishwaryaa Split Soundarya Drops New Profile Pic With Dad Rajinikanth And Sister, New Profile Pic, Dhanush, Aishwaryaa Rajinikanth, Soundarya Rajinikanth,Rajinikanth -అక్క విడాకులకు సపోర్ట్ ఇస్తున్న చెల్లి.. ప్రొఫైల్ పిక్ మారుస్తూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇది మారదు.ఇప్పటికే వీరిద్దరూ ఈ ఫాక్ట్ ను అంగీకరించి తమ తమ కేరీర్ లో బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇప్పుడు వీరి బాటలోనే మరొక స్టార్ కపుల్ విడిపోయి అభిమానులందరి మరింత షాక్ ఇచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వారి 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చాడు.రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను ధనుష్ 2004లో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వీరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని అందుకే వీరు విడిపోయారని వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ విడాకులు తీసుకున్న నేపథ్యంలో అక్కకు చెల్లి సౌందర్య సపోర్ట్ గా నిలుస్తున్నట్టు తెలుస్తుంది.సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఇద్దరు కూతుళ్లు కాగా ఒకరు ఐశ్వర్య, మరొకరు సౌందర్య.ఇప్పుడు అక్క విడాకుల విషయమై చెల్లి సపోర్ట్ చేస్తుంది.

తాజాగా సౌందర్య తన ప్రొఫైల్ పిక్ ని మారుస్తూ అక్కను ఓదార్చినట్టు కనిపిస్తుంది.రజనీకాంత్ తో చిన్నప్పుడు దిగిన ఫోటోను డీపీగా పెట్టుకుంది సౌందర్య.

దీంతో నెటిజెన్స్ అక్కకు మరింత సపోర్ట్ ఇవ్వమని చెల్లిని కోరుతున్నారు.ప్రస్తుతం సౌందర్య పెట్టిన ఈ ప్రొఫైల్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

Soundarya Rajinikanth Changed her Twitter Profile Pic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube