China Billionaire Selling Meat: అందుకే అప్పులు చేయకూడదనేది... కోటీశ్వరున్ని రోడ్డుకి లాగిన అప్పులు!

పెద్దలు ఊరికే అనలేదు… అప్పులు లేనివారే నిజమైన కోటీశ్వరులు అని! ఈ కథ వింటే మీకు ఆ విషయం బాగా బోధపడుతుంది.ఈ కధలో ఓ బిలియనీర్, అప్పుల ఊబిలో కూరుకుపోయి రోడ్డుమీదకు వచ్చేసాడు.

 After Declaring Bankruptcy Billionaire In China Became Poor Details,  Millioner-TeluguStop.com

ఎంతో విలాసవంతమైన జీవితం గడిపిన అతడు తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు.కానీ ఏం లాభం… బిజినెస్‌లో కోట్లకు పడగలెత్తి, తనకు సంబంధంలేని ఓ తప్పు చేసి రోడ్డుమీదకి వచ్చి రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే స్థాయికి చేరుకున్నాడు.

ప్రస్తుతం మాంసం అమ్ముకుంటూ. సాధారణ జీవితం గడుపుతున్నాడు.

వివరాల్లోకి వెళితే, చైనాలోని 52 ఏళ్ల వయసు గల తాంగ్‌జియన్‌ రెస్టారెంట్ల వ్యాపారంలో తిరుగులేని సక్సెస్ సాధించాడు.దాంతో కోట్లకు కోట్లు సంపాదించాడు.కట్ చేస్తే 36 ఏళ్ల వయసుకే కోట్ల రూపాయల వ్యాపారాన్ని వృద్ధి చేసి, తనదైన ఒక విలాసవంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఆలోచన చేసాడు.దాంతో తనకు ఏమాత్రం సంబంధంలేని ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.2005లో స్టార్ట్ అయిన ‘ల్యాండ్‌స్కేప్‌’ పరిశ్రమ అతనిని దివాళా తీసేలా చేసింది.అధిక లాభాలు వస్తాయని నమ్మి.ఆ వెంచర్‌లో పెట్టుబడి పెట్టిన తనకు భారీ నష్టాలు వచ్చాయి.

Telugu Billionaire, China, Bankruptcy, Latest, Meat, Poor-Latest News - Telugu

ఇంకేముంది కట్ చేస్తే, ఆ అప్పులు బాధలు తాళలేక తన రెస్టారంట్లు, ఇళ్లు, కార్లు అమ్మేసుకున్నాడు.అలా చేసినప్పటికీ ఇంకా రూ.52 కోట్లు అప్పు మిగిలేవుంది.దాంతో ఆ అప్పు తీర్చేందుకు అతను ఒక చిరు వ్యాపారం మొదలుపెట్టాడు.

హాంగ్‌ఝౌలోని ఓ వీధిలో మాంసంతో తయారు చేసిన ఆహారపదార్థాలను అమ్మడం స్టార్ట్ చేశాడు.ఒక కోటీశ్వరుడి నుంచి వీధి వ్యాపారిగా మారిన పరిస్థితిపై అతడు తాజాగా మాట్లాడుతూ.

కొన్ని సందర్భాలలో సవాళ్లతో కూడిన జీవితం గడపాల్సి వస్తుందని, అయితే.ఇలాంటప్పుడే ఓటమిని అంగీకరించకూడదనే స్ఫూర్తి కలిగి ఉండాలని హితవు పలికాడు.

సూపర్ కదూ!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube