ఎన్ని మార్పులు తెచ్చావే మహమ్మారీ: కొత్తగా కరోనా పాస్‌పోర్ట్ అంట..!!

కోట్లాది మందిని కృంగదీసి.లక్షలాది మంది ప్రాణాలు తీసి, మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది కరోనా మహమ్మారి.

 After Coronavirus Vaccine, 'vaccine Passport' Is The Next Thing To Acquire, Coro-TeluguStop.com

ఇది ఏ ముహూర్తాన భూమి మీద అడుగు పెట్టిందో కానీ.అప్పటి నుంచి మనిషి ప్రస్థానం కరోనా తర్వాత, కరోనాకు ముందు అన్నట్లుగా తయారైంది.

మునుపెన్నడూ మనకు పరిచయం లేని ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది.మాస్క్‌లు, శానిటైజ‌ర్లు, భౌతిక దూరాలు, లాక్‌డౌన్లు, కొత్త కొత్త ఆహార‌పు అల‌వాట్లు ఈ కోవలో వున్నాయి.

ఇప్పుడు కొత్తగా మరో పదం లిస్ట్‌లోకి వచ్చింది.అదే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అప్లికేషన్.

సాధారణంగా మనం స్వదేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్లినప్పుడు మన ఐడెంటీటీని చూపించడానికి పాస్‌పోర్ట్ వాడతాం.అచ్చం ఇదే తరహాలో ఉపయోగపడుతుంది వ్యాక్సిన్ పాస్‌పోర్ట్.ఇదొక యాప్.నిజానికి ఇది ఒక్కటి కాదు.

ఈ కేటగిరీలో ఎన్నో సంస్థలు యాప్స్ తీసుకొస్తున్నాయి.ఇక మీదట మీరు కరోనా నెగిటివ్ అని ప్రూఫ్ చూపించాలంటే ఈ యాప్ వాడాల్సి రావొచ్చని సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించింది.

సమావేశాలు, స్టేడియాల‌కు, థియేట‌ర్లకు.అంతెందుకు ఇత‌ర దేశాల‌కు వెళ్లాల‌న్నా.

ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ క‌చ్చితంగా ఉండాల్సిన ప‌రిస్థితి త‌లెత్త‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది.

Telugu Corona Pandemic, Passport-Telugu NRI

ఏమిటీ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్


దీనిలో కంపెనీలు రూపొందించిన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.అందులో మ‌న క‌రోనా టెస్టుల ఫ‌లితాలు, వ్యాక్సినేష‌న్‌కు సంబంధించిన స‌మాచారాన్ని న‌మోదు చేయాల్సి ఉంటుంది.ఎవ‌రైనా ఎక్క‌డైనా మీ క‌రోనా సంబంధిత వివ‌రాల‌ను అడిగిన‌ప్పుడు ఈ వివ‌రాల‌ను ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ల‌నే ఆధారాలుగా పరిగ‌ణించి ఆయా వ్య‌క్తుల‌ను వారి పని ప్ర‌దేశాల‌కు లేదా త‌మ దేశాల్లోకి అనుమ‌తించాలంటూ కొన్ని దేశాలు ఇప్ప‌టికే డబ్ల్యూహెచ్‌వోని కోరుతున్నాయి.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది.

కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లు, యాంటీబాడీస్ ఉన్న వాళ్ల‌కు మ‌రోసారి వైర‌స్ సోక‌దు అన‌డానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఈ ప్ర‌తిపాద‌న‌పై అనుమానాలు వ్యక్తం చేసింది.ఇలాంటి అప్లికేషన్‌లను ఆధారంగా చేసుకుని ఒక దేశం నుంచి మరొక దేశానికి అనుమతించడం వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి మ‌రింత పెరిగే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌ని డబ్ల్యూహెచ్ఓఅభిప్రాయ‌ప‌డింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube