ఇక టాలీవుడ్ పూర్తిగా ఫామ్‌ లోకి వచ్చినట్లేనా?

టాలీవుడ్‌ లో గత మార్చి నుండి సందడి కరువు అయ్యింది.కరోనా కారణంగా 2020 మార్చి నుండి సినిమాల విడుదల పూర్తిగా ఆగిపోయింది.

 After Corona Tollywood Came Back To Fame ,krack,master,tollywood,alludu Adhurs,t-TeluguStop.com

థియేటర్లు మూత పడటంతో సినిమాల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు.గత అక్టోబర్‌ నవంబర్‌ ల్లో థియేటర్లు పునః ప్రారంభం అయినా కూడా థియేటర్లు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాలు ఏమీ కూడా విడుదల కాలేదు.

మార్చి నుండి డిసెంబర్ వరకు థియేటర్ల వైపు జనాలు చూడలేదు.మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమాతో ఎట్టకేలకు ప్రేక్షకులు థియేటర్ల వైపుకు వస్తారు అనే నమ్మకం వచ్చింది.దాంతో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వచ్చాయి.

క్రాక్‌ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది.దాంతో వసూళ్ల వర్షం కురుస్తోంది.అద్బుతమైన రెస్పాన్స్‌ రావడంతో సినిమాకు భారీ ఎత్తున అంచనాలు ఉన్న కారణంగా వసూళ్లు భారీగానే వస్తున్నాయి.ఇక మాస్టర్ సినిమా తమిళం నుండి ఇక్కడకు వచ్చినా కూడా తెలుగు ఆడియన్స్ ఆధరిస్తున్నారు.

ఇక అల్లుడు అదుర్స్‌ మరియు రెడ్‌ సినిమాలు మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి.అయినా కూడా సినిమాలు సంక్రాంతి కనుక మంచి వసూళ్లను రాబట్టాయి.

భారీగానే ఓపెనింగ్స్ ఉన్నాయి.లాంగ్‌ రన్‌ లో కూడా మునుపటి పరిస్థితి కనిపించే అవకాశం ఉంది.

అందుకే టాలీవుడ్‌ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్‌ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇక ఈ జోరు మళ్లీ కంటిన్యూ అవ్వబోతుంది.

సమ్మర్‌ లో పెద్ద సినిమాలు రాకతో నూరు శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది.దాదాపు ఏడాది పాటు నెలకొన్ని విపత్కర పరిస్థితులు మళ్లీ పూర్వ రూపంకు మరలుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube