Chiranjeevi Anurag Tagore : అదేంటి చిరు.. సినిమాల విలువ నీకు రాజకీయాల్లోకి వెళ్లేవరకు తెలియలేదా? అసలు అవేం కామెంట్స్?

After Come Back From Politics I Know Film Industry Value Chiranjeevi Comments In Goa Film Festival, Chiranjeevi, Industry Value, Comments Viral , Tollywood

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కాగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డుని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.

 After Come Back From Politics I Know Film Industry Value Chiranjeevi Comments In-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవికి ఈ పురస్కారాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా అందుకున్నారు చిరంజీవి.ఆ పురస్కారాన్ని అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.

ఈ అవార్డు కోసం నన్ను ఎంపిక చేసిన ప్రభుత్వానికి అలాగే అనురాగ్ ఠాగూర్, గోవా ఫిలిం ఫెస్టివల్ కి ధన్యవాదాలు అని తెలిపారు మెగాస్టార్.

ఈ పురస్కారాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.టాలెంట్ ఉన్నవాళ్లు ఈ రంగంలో రాణిస్తారని లేనివారు రాణించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చారు చిరంజీవి.టాలెంట్ ఉన్నవారు ఎవరైనా సినిమా రంగంలోకి రావచ్చని తాను ఎప్పుడూ కూడా వెల్కమ్ చెబుతాను అని తెలిపారు చిరు.ఇటువంటి అవినీతి లేని ఏకైక రంగం సినిమా రంగం అని, సినిమా రంగం విలువ తనకు రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

Telugu Chiranjeevi, Tollywood-Movie

అలాగే తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే వారి ప్రేమకు తాను దాసోహమని, వారి ప్రేమనే తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని తెలిపారు మెగాస్టార్.కాగా ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి శివశంకర్ ప్రసాద్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తనకు చిరంజీవిగా ఇంతటి పేరు ప్రఖ్యాతలు సినిమా రంగంలో దక్కాయి అంటూ సినిమా రంగం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు చిరు.పలువురు నెటిజన్స్ చిరంజీవి వ్యాఖ్యలపై స్పందిస్తూ.

అవేం కామెంట్స్ చిరు నీకు సినిమాల విలువ రాజకీయాలలోకి వెళ్లే వరకు తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube