మెగా ప్రాజెక్ట్ ని పక్కనెట్టిన త్రివిక్రమ్  

After Bunny Movie Trivikram Work With Jr Ntr-jr Ntr,megastar And Trivikram Movie,megastar Movie,trivikram

అజ్ఞాతవాసితో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న దర్శకుడు త్రివిక్రమ్ అనంతరం అరవింద సమేత సినిమాతో పరవాలేధనిపించాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా బన్నీతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించాలని కష్టపడుతున్నాడు..

మెగా ప్రాజెక్ట్ ని పక్కనెట్టిన త్రివిక్రమ్-After Bunny Movie Trivikram Work With Jr Ntr

అయితే ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అందుకు ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయినట్లు కూడా టాక్ వచ్చింది.

వచ్చే ఏడాది బన్నీతో సినిమా అయిపోగానే చిరంజీవితో కొత్త సినిమాను సెట్ చేస్తాడని కథనాలు వెలువడ్డాయి..

అయితే లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్స్ ప్రకారం. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద సమేత సమయంలోనే తారక్ త్రివిక్రమ్ చెప్పిన ఒక లైన్ ను బాగా ఇష్టపడ్డాడట. RRR అయిపోగానే సినిమాను స్టార్ట్ చేద్దామని మాటల మాంత్రికుడికి తారక్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే వెంకటేష్ – మెగాస్టార్ లతో వర్క్ చేస్తాడని అనుకున్న త్రివిక్రమ్ వారు బిజీగా ఉండడంతో ఆ స్క్రిప్ట్స్ ని పక్కనెట్టేశాడట. జనవరిలోనే రాజమౌళి తో చేస్తున్న RRR షూటింగ్ ని కంప్లీట్ చేసి త్రివిక్రమ్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనీ యంగ్ టైగర్ ఫిక్స్ అయినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.